కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు కరోనా సోకింది. దీంతో వారు ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే స్వల్ప లక్షణాలతో కరోనా సోకిందని చంద్రబాబు తెలిపారు. దీనిపై రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తూ.. చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తూ..…
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరాముడు మహాభినిష్క్రమణ చేసి అప్పుడే 26 ఏళ్ళయింది. అయినా ఆయనను మరచినవారు లేరు. అన్నగా జనం గుండెల్లో నిలిచారు. తెలుగు చిత్రపరిశ్రమకు ‘పెద్దాయన’గా నిలచిన నటరత్న యన్టీఆర్ నా అనుకున్నవారిని ఆదుకున్న తీరును ఈ నాటికీ సినీజనం తలచుకుంటూ ఉన్నారు. అలా ఆయన అభిమానంతో వెలుగులు విరజిమ్మిన వారెందరో. తెరపై అనేక మార్లు శ్రీకృష్ణ పరమాత్మగా నటించి అలరించారు రామారావు. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకొనే కన్నయ్యగా నటించడమే కాదు, నిజజీవితంలోనూ యన్టీఆర్…
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది అంటూ ప్రచారం జరుగుతుండగా, మరోవైపు ఇద్దరు హీరోలూ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెడుతున్నారు. దర్శకుడు శివ కొరటాలతో జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ కు తాత్కాలికంగా “ఎన్టీఆర్ 30” అనే టైటిల్‌తో పిలుస్తున్నారు.…
ప్రతిసారి సంక్రాంతికి టాలీవుడ్ లో భారీ పోటీ నెలకొంటుంది. బాక్స్ ఆఫీస్ బరిలో పెద్ద పెద్ద సినిమాలు నిలవడంతో సందడి సందడిగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఫ్యామిలీతో కలిసి మరీ సంక్రాంతికి సినిమాలను చూడడానికి ఇష్టపడతారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈసారి మాత్రం సంక్రాంతి పెద్ద సినిమాల సందడి లేదు. అయితే వరుసగా వారసుల ఎంట్రీ మాత్రం జరుగుతోంది. సంక్రాంతికి దాదాపు ఆరేడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో చెప్పుకోవాల్సిన పెద్ద సినిమా అంటే…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా డైనమిక్ లుక్ లో దర్శనం ఇచ్చారు. తారక్ స్టైలిస్ట్, అశ్విన్ మావ్లే ఈ రోజు ఎన్టీఆర్ స్టైలిష్ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పిక్ లో ఎన్టీఆర్ పూర్తిగా నలుపు రంగు సూట్ ధరించి అద్భుతంగా కనిపిస్తున్నాడు. తారక్ తన సూట్‌కు సరిపోయేలా నలుపు రంగు టై, నల్ల బూట్లు కూడా ధరించాడు. నటుడు తన క్లాసీ, స్టైలిష్ లుక్ తో అభిమానులకు మంచి కిక్ ఇచ్చాడు.…
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. బిసీలకు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అయితే..ఆయన్ను పదవీవీచ్చుతుణ్ని చేసిన సందర్భంలో, మరణించినప్పుడు మీరు ప్రవర్తించిన తీరు బీసీల మనోభావాలను దెబ్బతీసాయన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల ద్రోహి. బీసీలంటే టీడీపీలో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు మాత్రమే అన్నారు. అధికారంలో ఉండగా బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదు. మత్స్యకారులను..నాయి బ్రహ్మణులను తోలు వలుస్తా..తోకలు కత్తిరిస్తా అంటూ చాలా చులనగా చేసి మాట్లాడారు. బీసీలు మా వెనుకున్నారని చంద్రబాబు…
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వారం రోజులు దుబాయ్ లో గడిపిన తర్వాత మహేష్ బాబు ఇటీవలే హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. మహేష్, ఆయన కుటుంబం ఇక్కడికి వచ్చిన వెంటనే కోవిడ్ టెస్ట్ చేసుకున్నారు. అందులో మహేష్ బాబు టెస్ట్ రిజల్ట్స్ సానుకూలంగా వచ్చాయి. మహేష్ ఫ్యామిలీ మెంబెర్స్ కోవిడ్ టెస్ట్ రిజల్ట్స్ ఇంకా రావలసి ఉందని, మరికొన్ని గంటల్లో ఈ విషయం వెల్లడవుతుందని సమాచారం. ఇక మహేష్ నిన్న రాత్రి తనకు కోవిడ్ పాజిటివ్…
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి అడుగడుగా అడ్డంకులు తప్పట్లేదు. ఇప్పటికే సినిమాను కరోనా కారణంగా 4 సార్లు వాయిదా వేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాకు మరో కష్టం వచ్చింది. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య అనే మహిళ ఈ పిటిషన్ దాఖలు చేసింది. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతా రామరాజు,…
వైఎస్ ఆర్ రైతు భరోసాలో తొలుత 45లక్షల మందికి రైతు భరోసా ప్రారంభించామని ఇప్పుడు 50.58 లక్షలపైగా రైతులకు రైతుభరోసా అందుతుందని మంత్రి కన్నబాబు అన్నారు. సోమవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలు పండించాలని ప్రభుత్వమే కోరుతుందన్నారు. ప్రభుత్వం అసలు వరి పండించొద్దని చెబుతున్నట్లు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటన దురదుష్టకర ఘటనగా మంత్రి చెప్పారు. ఇలాంటి ఘటనలు…