దర్శక దిగ్గజం రాజమౌళి మాగ్నమ్ ఓపస్ యాక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ డమ్ ను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత వరుసగా మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాశారు చరణ్. అందులో విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్సీ 15’ చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే ‘ఆర్సీ 16’కూడా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లు జోరుగా సాగిస్తున్నారు టీం. ఈ నేపథ్యంలో చెర్రీ రెమ్యూనరేషన్ గురించి నేషనల్…
కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. ఇప్పుడు మరోసారి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచం మొత్తం భయాందోళనలను సృష్టించింది. తాజాగా బయటపడిన మరో వేరియంట్ డెల్మిక్రాన్ హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ప్రజలను జాగ్రత్తగా ఉండమని కోరుతూ, మరోమారు లాక్ డౌన్ పరిస్థితులు రాకుండా ఉండడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అయితే కొంతమంది ఇంకా కోవిడ్-19 వ్యాక్సిన్ ను తీసుకోలేదు. అది తీసుకుంటే కరోనాతో పాటు ఒమిక్రాన్ కూడా తగ్గుతుందనేది వైద్యుల సలహా.…
మన దర్శక దిగ్గజం రాజమౌళి బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. పైగా సినిమాలో ఇద్దరు విలన్స్… వాళ్లిద్దరూ కూడా మన టాలీవుడ్ స్టార్స్ కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు జరిగింది ? అని ఆలోచిస్తున్నారా ?… అసలు విషయం ఏమిటంటే రాజమౌళి నిజంగానే సల్మాన్ ఖాన్ ను నిజంగానే డైరెక్ట్ చేశారు. అయితే అది సినిమాలో కాదు…. బుల్లితెరపై. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ పాపులర్ రియాలిటీ షో ‘బిగ్…
2022 డిసెంబర్ 27న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు. ఆయనకు మరో రెండ్రోజుల్లో 56 ఏళ్లు నిండుతాయి. అయితే ఈ బీటౌన్ సూపర్ స్టార్ మన సౌత్ స్టార్స్ తో కలిసి పుట్టినరోజు వేడుకలను సెలెబ్రేట్ చేసుకున్నారు. “ఆర్ఆర్ఆర్”ని ప్రమోట్ చేయడానికి దర్శకుడు రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్‌లతో సహా సినిమాలోని ప్రధాన తారాగణం సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న “బిగ్ బాస్ 15″కి హాజరయ్యారు. ఈ…
ముంబై తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళి తన దృష్టిని దక్షిణాది వైపు మళ్లించాడు. ముంబైలో తారక్, చరణ్, రాజమౌళి “బిగ్ బాస్ సీజన్ 15” నుంచి “ది కపిల్ శర్మ షో”తో సహా ప్రముఖ టీవీ షోలలో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చి అక్కడ సినిమా విడుదలపై భారీగా హైప్ పెంచేశారు. ఇక ఇప్పటిదాకా బాలీవుడ్ పై పూర్తిగా ఫోకస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ త్రయం ఇప్పుడు సౌత్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి సరికొత్త ప్లాన్స్ వేస్తోంది. తమిళంలో…
తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్ చాలా పెద్దది. ఈ సమయంలో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జాతర జరుగుతుంది. పెద్ద, చిన్న చిత్రాలన్నీ విడుదలవుతాయి. ఈ సమయంలో భారీ సినిమాల క్లాష్‌లు రాకుండా, వసూళ్లకు గండి పడకుండా ఉండేందుకు తెలుగు పెద్ద సినిమాలు ఇటీవలే ఒక అవగాహనకు వచ్చి, విడుదల తేదీలను మరోమారు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో మధ్యలో నుంచి ‘భీమ్లా నాయక్’ను తప్పించారు. ఇక కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల అనిశ్చితి…
“ఆర్ఆర్ఆర్” టీం తమ సినిమాను అన్ని విధాలుగా రెస్ట్‌లెస్‌గా ప్రమోట్ చేస్తోంది. ప్రస్తుతానికి బాలీవుడ్ పై దృష్టి పెట్టారు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం. అందులో భాగంగానే హిందీలో అత్యంత పాపులర్ అయిన టీవీ రియాల్టీ షో “బిగ్ బాస్ 15″కి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఎస్ఎస్ రాజమౌళి అతిథులుగా హాజరయ్యారు. స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోలో అలియా భట్ తెలుగులో కొన్ని మాటలు మాట్లాడింది. అంతేకాదు హోస్ట్ సల్మాన్ ఖాన్‌కి రామ్ చరణ్, తారక్ ఫేమస్…
నటరత్న నందమూరి తారక రామారావు నటజీవితం పరిశీలించిచూస్తే, ఉవ్వెత్తున ఎగసి, ఉస్సురుమని కూలిన కెరటాలు కనిపిస్తాయి. నింగిన తాకిన విజయాలే అధికం. అయితే 1971లో రంగుల సినిమాల ముందు రామారావు నలుపు-తెలుపు చిత్రాలు వెలవెల బోయాయి. ఆ సమయంలో అభిమానుల మది తల్లడిల్లిన మాట వాస్తవమే! అయితే ఎప్పటికప్పుడు తనను అభిమానించేవారిని తలెత్తుకొనేలా చేస్తూనే యన్టీఆర్ చలనచిత్ర జీవనయానం సాగింది. అదే తీరున పలు పరాజయాలు పలకరించిన వేళ, 1971లో అభిమానులకు మహదానందం పంచిన చిత్రంగా ‘శ్రీకృష్ణ…
టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ వెనుక ఉన్న త్రయం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆ, దర్శక దిగ్గజం రాజమౌళి ఈ చిత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఈ చిత్రం నుండి 4వ పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో కొమురం భీమ్ ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసినట్టు ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది. “కొమురం భీముడో” అంటూ సాగిన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. పూర్తి…
దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్ ప్లాన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు రాజమౌళి బాలీవుడ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగిందన్న విషయం తెలిసిందే. అది త్వరలోనే ఓ ఛానల్ లో ప్రసారం కానుంది. ఇక తాజాగా ప్రో కబడ్డీ వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ టీం సందడి చేసి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం జక్కన్న తన…