రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” మూవీ ప్రమోషన్ బాధ్యతలను “భీమ్”కు అప్పజెప్పారు. “ఆర్ఆర్ఆర్” మూవీ షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతోంది. అక్కడ సినిమాలోని ఓ పాటకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అందులో ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరుగుతోంది. ఇక సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుండడంతో మూవీ ప్రమోషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాలో నుంచి మేకింగ్ వీడియోతో పాటు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విడుదలైన “దోస్తీ” పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ప్రమోషన్లకు మేకర్స్ సిద్ధమయ్యారు.
Read Also : మహేష్ తో అనిల్ రావిపూడి మూవీ… వెయిట్ చేయాల్సిందేనట !
సినిమాలో “భీమ్” పాత్రలో కనిపించనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈసారి ప్రత్యేకంగా “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ బాధ్యతలను భుజానికెత్తుకున్నాడు. తారక్ “ఆర్ఆర్ఆర్” అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను రాబోయే పది రోజుల పాటు తన హ్యాండోవర్ లోకి తీసుకుంటున్నారు. కొమరం భీమ్ “ఆర్ఆర్ఆర్” చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్న ఉక్రెయిన్ లో ఏం చేస్తున్నాడు అనే విషయాలను అభిమానులతో పంచుకోబోతున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్, రాజమౌళి కూడా ఈ విధంగానే “ఆర్ఆర్ఆర్” ఇన్స్టా ఖాతా ప్రమోషన్లు చేపట్టి ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాపై బజ్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారట.