ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం మొదటిరోజు ఘనంగా ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ-ఎన్టీవీ ఆధ్వర్యంలో జరుగుతోన్న కోటిదీపోత్సవం ఐదో రోజుకు చేరింది. దీంతో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. కార్తీక మాసంలో జరుగుతోన్న దీపాల ఉత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ రోజు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన వేదిక జరుగుతోంది. కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన భక్తులు స్వయంగా చేపట్టారు. అటు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అనంతరం సింహ వాహనం…