Koti Deepotsavam 2023: నేటి నుంచి కోటి దీపోత్సవం.. తొలిరోజు జరిగే మహా ఘట్టాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2023: కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. కార్తిక స్నానాలు, దైవ దర్శనాలు, దీపారాధనతో అన్ని పుణ్యక్షేత్రాలు భక్తులతో రద్దీగా మారుతాయి.. ఇదే సమయంలో.. అందరి చూపు ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటిదీపోత్సవంపై ఉంటుంది.. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా రచనా టెలివిజన్ ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న విషయం విదితమే కాగా.. ఆ మహా దీపయజ్ఞం ఈ రోజు ప్రారంభం కానుంది.. ”దీపం జ్యోతిః పరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీప నమోస్తుతే” అంటారు..’ ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు.. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగుల మయం అవుతుందని నమ్మకం.. దీపం వెలుగుకు, జ్ఞానానికి సంకేతం, అధ్యాత్మికంగా దీపానికి చాలా ప్రముఖ్యం ఉంది..మన సంస్కృతికి సంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్మగా నిలిచింది.. అటువంటి సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా 2013 నుంచి భక్తి టీవీ కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తుంది..
ఏటా కార్తీక మాసంలో దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామార్తలను దేవికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహిస్తారు.. ప్రసిద్ధ పండితుల ప్రవచనాలు అందిస్తున్నారు.. పీఠాధిపతులు అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందజేస్తారు.. అతిరథ మహారథుల అథిథులుగా విచ్చేసే ఈ దీప యజ్ఞం ఈరోజు ప్రారంభం కానుంది.. భక్తి టీవీ కోటిదీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచనా టెలివిజన్ పక్షాన పూర్తి ఉచితంగా అందిస్తున్న విషయం విదితమే.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా భక్తి టీవీ ఈ దీప మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ వస్తుంది.. నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటిదీపోత్సవం జరగనుంది.. పెద్ద సంఖ్యలో తరలిరావాల్సింది భక్తులకు ఆహ్వానం పలుకుతోంది భక్తి టీవీ..
Also Read
- AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
- Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
- Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
- Astrology: అక్టోబర్ 21 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
ఇక, భక్తి టీవీ కోటిదీపోత్సవంలో తొలి రోజు నిర్వహించనున్న విశేష కార్యక్రమాల విషయానికి వస్తే..
* సమస్త పుణ్య నదుల జలాలతో కాశీస్పటిక లింగానికి సహస్రకలశాభిషేకం..
* భక్తులతో కోటిమల్లెల అర్చన..
* శ్రీశైలం శ్రీభ్రమరాంబమల్లికార్జునుల కల్యాణం..
* హంసవాహనంపై ఆదిదంపతుల దర్శనం
* సూత్తూరు శ్రీక్షేత్ర మఠాధిపతి శ్రీశివరాత్రిదేశికేంద్ర మహాస్వామి అనుగ్రహ భాషణం
* శ్రీబాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి ప్రవచనామృతం
* అపూర్వ సాంస్కృతిక కదంబాలు.. సప్తహారతుల కాంతులు.. కోటి దీపాల వెలుగులు.. మహాదేవునికి మహానీరాజనాలు.. రండి.. సాయంత్రానికి ఎన్టీఆర్ స్టేడియానికి.. ఆహ్వానం పలుకుతోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్..

తాజావార్తలు
-
Harmanpreet Kaur 91 Runs: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలనం.. స్మృతి మంధాన రికార్డు బద్దలు!
-
AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
-
Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
-
Realme C01: 6500mAh బ్యాటరీతో కొత్త రియల్మీ ఫోన్.. 120Hz డిస్ప్లే, ధర వివరాలు!
-
Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!