Devineni Uma: దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలే అజెండా.. పేదవాడి వద్దకు ప్రజాప్రతినిధులను తీసుకెళ్లింది ఆయనేనని గుర్తుచేసుకున్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే, స్థల వివాదంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మైలవరం టీడీపీ కార్యాలయానికి తాళాలు వేశారు పోలీసులు.. తాళాలేసిన టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించిన దేవినేని ఉమ, కేశినేని చిన్ని… వర్ధంతి కార్యక్రమం సందర్భంగా…