నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అంటే మూడు అక్షరాలు కాదని, తెలుగువారి ఆత్మగౌరవం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుజాతి చరిత్ర ఉన్నంతవరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రయత్నించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. రాజకీయాలను ఎన్టీఆర్ సమూలంగా మార్చారన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. గొప్ప కథానాయకుడిగా, గొప్ప నాయకుడుగా ఎదిగారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి…
ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్‌లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహంకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురధేశ్వరి ఘన నివాళి అర్పించారు. మరణం లేని జననం ఎన్టీఆర్ జననం అని, జన్మ జన్మకి ఆయనకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నాను అని పురధేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ గారు ఏ రంగంలో ఉన్నా.. ఆ రంగానికి ఆయన వన్నె తెచ్చారన్నారు. నేడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నివాళులు అర్పిస్తున్నారు.…
తెలంగాణలో టీడీపీ పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నాం అని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తెలంగాణలో 1.60 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ మరియు ఆశ ఉందన్నారు. తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యం అని లోకేశ్ చెప్పారు. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి నారా లోకేశ్ నివాళి అర్పించారు.…
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళి అర్పించారు. నాయకుడిగా, సీఎంగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనో వేదనకు గురవుతున్నానని తెలిపారు. లక్షలాది ప్రజలు చూస్తుండగా ఎన్టీఆర్ తనను వివాహం చేసుకున్నారని, తనను ఎందుకు నందమూరి కుటుంబ సభ్యురాలుగా చూడడం లేదు అని ప్రశ్నించారు. తనకు అవమానం జరుగుతుంటే సీఎం చంద్రబాబు ఇలానే చూస్తూ ఉంటారా?…
ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ఇంకా బ్రతికే ఉందంటే అది ఎన్టీఆర్ గారు ఇచ్చిన క్రమశిక్షణా, స్ఫూర్తి అని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు రాణిస్తున్నారు అంటే అది ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యం అని పేర్కొన్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని తన లాంటి చాలా మందిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారని రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సభలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా…
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. గుడివాడలో పొలిటికల్ రగడ మొదలైంది.. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి..
Chandrababu: అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 27వ వర్థంతి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. తొలిసారిగా తాను అనురాగదేవత సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్‌ను కలిశానని.. తన తొలి భేటీలోనే ఎన్టీఆర్ ప్రజాసేవ గురించి వ్యాఖ్యానించారని చెప్పారు. ఒక సినిమా నటుడిగా వచ్చి.. తరువాత కాలంలో రాజకీయాలను సమూలంగా మార్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి…
NTR Death Anniversary: తెలుగువారి మదిలో ‘అన్న’గా నిలిచిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అవనిని వీడి అప్పుడే 27 ఏళ్ళవుతోంది. అయినా ఆయన తలపులు తెలుగువారిని సదా వెన్నాడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ మరణం తరువాత తరలివచ్చిన తరాలు సైతం యన్టీఆర్ నామస్మరణ చేస్తూనే ఉండడం విశేషం. అందుకు చలనచిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ సాగించిన అనితరసాధ్యమైన పయనమే కారణమని చెప్పక తప్పదు. ఎన్టీఆర్ అన్న మూడక్షరాలు వింటే చాలు తెలుగువారి మది పులకించి పోతుంది.…
నందమూరి బాలకృష్ణ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాట కటువే కానీ మనసు మాత్రం వెన్న అని అందరికి తెలిసిందే. ఇక బయట వేడుకలకు వచ్చినప్పుడు అభిమానులపై బాలయ్య చేయి చేసుకోవడం సాధారణంగా జరిగే ఘటనలే. ఇంకొన్ని చోట్ల రిపోర్టర్లపై కూడా అబలయ్య చిందులు తొక్కినా సందర్భాలు కోకోల్లలు. ఇక తాజాగా మరోసారి రిపోర్టర్ కి స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు బాలయ్య. నేడు బాలకృష్ణ తండ్రి, దివంగత నటుడు ఎన్టీఆర్…