Nara Lokesh: త్వరలోనే తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాం!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన నారా లోకేశ్
- ఎన్టీఆర్ కేవలం మూడు అక్షరాలు కాదు
- తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో టీడీపీ పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నాం అని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తెలంగాణలో 1.60 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ మరియు ఆశ ఉందన్నారు. తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యం అని లోకేశ్ చెప్పారు. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి నారా లోకేశ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎంగా ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ… ‘ఎన్టీఆర్ కేవలం మూడు అక్షరాలు కాదు.. అదొక్క ప్రభంజనం. సినీ రంగంలో అన్ని రకాల సినిమాలు తీసి తన మార్క్ చూపించారు. రాజకీయాల్లో కూడా ఎన్నో సేవలు అందించారు. రెండు రూపాయలకే బియ్యం అందించారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు వారిని మద్రాసీలు అనేవారు.. వాళ్లందరికీ తెలుగు వరమని గర్వంగా చెప్పుకునేలా చేశారు. ఎన్టీఆర్ ఏ ఆశయాలతో పార్టీని పెట్టారో మాకు తెలుసు. ఆయన ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళతాం. ఏదైనా తప్పు జరిగితే.. దానిని సరిదిద్దడానికి కూడా పార్టీలో పెద్దలు ఉన్నారు’ అని చెప్పారు.
Also Read
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
Also Read: Lakshmi Parvathi: సీఎం చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్!
‘మా చిన్న తనంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. అప్పుడు ఆయన అబిడ్స్ లో ఉండేవారు. ఆ సమయంలో మమ్మల్ని గండిపేట తీసుకెళ్లేందుకు ఒక పెద్ద కారులో ఆయనే స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళారు. దారి మధ్యలో లెఫ్టుకు వెళ్లాలో, రైటుకు వెళ్లాలో తెలియక రోడ్డు మధ్యలో గుద్దేశారు. అది మాకు ఎప్పుడు గుర్తుండి పోయే మెమరీ. తెలంగాణలో టీడీపీపై ప్రజలకు ఎంతో ప్రేమ ఉంది. అందుకు ఉదాహరణ.. స్వచ్చందంగా లక్షా 60 వేల సభ్యత్వాలు ప్రజలు తీసుకోవడం. ఇప్పుడు ఎలాంటి ఎమ్మెల్యేలు లేకుండా ఇంతమంది సభ్యత్వం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తాం. త్వరలోనే తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాం’ అని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!