Indian economy: జనవరి - మార్చి కాలంలో మార్చి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతం నమోదైంది.దీంతో వార్షిక వృద్ధిరేటు 8.2 శాతానికి పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 8.6 శాతం కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, గతేడాది(2022-23) ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో(జనవరి-మార్చి)తో పోలిస్తే మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి.
Today (07-01-23) Business Headlines: గ్లాండ్ ఫార్మా చేతికి ఐరోపా సంస్థ: ఐరోపా సంస్థ సెనెగ్జి గ్రూపులో మొత్తం వాటా కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీ గ్లాండ్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ అనుబంధ సంస్థ గ్లాండ్ ఫార్మా ఇంటర్నేషనల్ పీటీఈ ద్వారా ఈ షేరును దక్కించుకుంటుంది. దాదాపు 20 ఏళ్ల కిందట ఏర్పాటైన సెనెగ్జి గ్రూపు.. ఫ్రాన్స్ మరియు బెల్జియం దేశాల్లో ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తి తదితర పనులు చేస్తోంది.