కన్నప్రేమను మించినదేదీ లేదంటారు. విడిపోయిన కన్నవారిని ఓ చిన్నారి ప్రేమ కలిపింది. ఆమె కన్నవారు సెలబ్రిటీస్ కావడంతో ఆ వార్త మరింతగా హల్ చల్ చేస్తోంది. ఇంతకూ విషయమేమిటంటే, ప్రముఖ మోడల్, టీవీ రియాలిటీ స్టార్ , బిజినెస్ ఉమన్ గా పేరొందిన కిమ్ కర్దాషియన్, ఇరవై ఏళ్ళలో మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది. కిమ్ మూడో భర్త ప్రఖ్యాత ర్యాపర్ కేన్ వెస్ట్. వీరిద్దరూ కలసి దాదాపు పదేళ్ళు కాపురం చేశారు. అంతకు ముందు సహజీవనమూ సాగించారు.…