నాగార్జునాసాగర్ ఎమ్మెల్యే నోములు భగత్, ఎమ్మెల్సీ యంసీ కోటిరెడ్డి మధ్య దూరం చాలా పెరిగిపోయిందట. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య పెరిగిన ఈ గ్యాప్ తప్పకుండా పార్టీకి నష్టం కలిగిస్తుందని అంటున్నారు కార్యకర్తలు. మనుషులు ఇద్దరూ ఒకే దగ్గర, ఒకే వేదిక మీద ఉన్నా పెదవి విప్పకపోవడం… పలకరించుకోకపోవడం వంటి ఘటనలు రొటీన్‌గా మారాయి. వారిద్దరూ పలకరించుకుంటే పెద్ద విశేషంలా చెప్పుకుంటున్నారు కార్యకర్తలు. ఇద్దరి మధ్య పంచాయితీ విషయంలో అధినేత జోక్యం చేసుకుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాటే ఫైనల్…