క్కువ ధరలకే ఐఫోన్లు అంటూ జనాలను మోసం చేస్తున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు నోయిడా పోలీసులు. నకిలీ ఐఫోన్లు విక్రయిస్తున్న నోయిడా గ్యాంగ్‌లోని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ రాజధాని ప్రాంతంలో (NCR) తక్కువ ధరకు చైనా తయారు చేసిన డూప్లికేట్ యాపిల్ ఐఫోన్‌లను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను నోయిడా పోలీసులు గురువారం పట్టుకున్నారు.