పార్వతీపుతం మన్యం జిల్లాలో గిరిజన ప్రాంతాలలో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదుకు ఆటంకం కలుగుతోంది. స్కూళ్లు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న తరగతులు జరగకా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని పాచిపెంట మండలం గరిసిగుడ్డి పంచాయతీ తాడివలస గిరిజన గ్రామంలో గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టారు. జిపిఎస్ స్కూల్ వెంటనే తెరవాలని ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని ఆదివాసి గిరిజన సంఘం సిఐటియు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.…