తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తరహాలో మాటల తూటాలు పేలుతుంటాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనపై మండిపడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీ ప్రభుత్వంలో వీఆర్ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందన్నారు రేవంత్. గొడ్డు చాకిరీ చేయించుకుని… వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. చాలీ చాలని జీతాలు … ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్ఒల పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు.…