నిజమాబాద్ జిల్లా బోధన్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెంటఖుర్డు గ్రామంలో దారుణం వెలుగుచూసింది. కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు కసాయిలా మారాడు. కన్నతల్లి పట్ల కాలయముడయ్యాడు. తాగిన మత్తులో తల్లిని గొడ్డలితో నరికాడు చిన్న కొడుకు సురేశ్. తల్లిని హతమార్చిన అనంతరం నగలు ఎత్తుకెళ్లాడు. సుమారు 50 తులాల వెండి ఆభరణాలు అపహరించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు…
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న బావ బామ్మర్దులను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఇద్దరు మృతిచెందారు. బైక్ ను ఢీకొన్న తర్వాత కంటైనర్ పల్టీలు కొట్టింది. కేక్ కొనేందుకు బైక్ పై బయల్దేరిన బావ బామ్మర్దులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులు వివేక్ నగర్ తండాకు చెందిన శ్రీనివాస్, నవీన్ గా గుర్తించారు. Also Read:Vallabhaneni Vamsi:…
Fraud : ప్రభుత్వ ఉద్యోగం అనే ఆశ చూపించి అమాయకులను మోసం చేస్తున్న ఘటన నిజామాబాద్ జిల్లా కోర్టు పరిధిలో వెలుగులోకి వచ్చింది. కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఒక మహిళ నుంచి రూ. 9 లక్షలు తీసుకుని నకిలీ నియామక పత్రం ఇచ్చిన ఘటన కలకలం రేపుతోంది. సిరికొండ మండలం చీమన్పల్లి గ్రామానికి చెందిన మాలవత్ మోహన్ అనే వ్యక్తి పై తేజావత్ పిరూ అనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు ఉద్యోగం, పోస్టాఫీస్…
Mahesh Goud : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపై టీపీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్లో మంత్రివర్గ విస్తరణపై స్పందించిన ఆయన, ఈ నెల చివరిలో లేదా జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ జరగవచ్చని అభిప్రాయపడ్డారు. వివిధ సమీకరణాల కారణంగా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్నట్టు తెలిపారు. ఆసక్తి ఉన్నవారెంతైనా ఎక్కువగా ఉన్నప్పటికీ ఖాళీల సంఖ్య తక్కువగా ఉండటం వలన ఆలస్యం జరుగుతోందని అసహనం వ్యక్తం…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో.. ఇసుక దందా జోరుగా నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. హస్తం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు... ఇందులో మునిగి తేలుతున్నారట. ఎమ్మెల్యేల కనుసన్నల్లో కొంత.. వాళ్ళ పేర్లు చెప్పి మరింత దందా చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
Leopard: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నవనాధ సిద్ధుల గుట్ట సమీపంలో భయం భయంగా ఉంది. చిల్డ్రన్ పార్క్ సమీపంలోని రాళ్ళ మధ్యలో చిరుతను స్థానికులు చూశారు. దీంతో చిరుత వీడియోను భక్తులు చిత్రీకరించారు.
Student Missing: లండన్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపుతుంది. ముప్కాల్ మండలం రెంజర్లకు చెందిన అనురాగ్ రెడ్డి లండన్ లో ఈ నెల 25వ తేదీన అదృశ్యం అయ్యాడు. కార్దీప్ ప్రాంతానికి స్నేహితులతో కలిసి వెళ్ళి అదృశ్యమైయ్యాడు.
తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. ఈ ఏడు జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది..
బీఆర్ఎస్ పని అయిపోయింది.. మళ్ళీ మాదే అధికారం, రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు.. ఇన్ డైరెక్ట్ గా బీజేపీకి మద్దతిచ్చి బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుంది అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ అనేది ఉండదని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
నేటి నుంచి ‘రైతు మహోత్సవం’ వేడుకలు ఆరంభం కానున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏప్రిల్ 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. రైతు మహోత్సవం నేపథ్యంలో నేడు జిల్లాలో ముగ్గురు మంత్రులు, పీసీసీ చీఫ్ పర్యటించనున్నారు. రాష్ట్ర రైతు మహోత్సవం మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లి.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరంబించనున్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు రైతులకు అందే సేవలను మరింత చేరువ…