Medical College Scam: నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాల పేరిట ఘరానా మోసం వెలుగు చూసింది. మెడికల్ కళాశాలలో భాగస్వామ్యం పేరిట అత్యాశకు వెళ్లి పెట్టుబడులు పెట్టిన ప్రైవేట్ వైద్యులు.. లబోదిబోమంటున్నారు. సదరు మెడికల్ కళాశాలకు MNC అనుమతి నిరాకరించడంతో.. ఈ మోసం వెలుగు చూసింది. వైద్యులు పెట్టిన డబ్బులు బ్లాక్ మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. మెడికల్ కళాశాలలో ఉద్యోగం దొరకిందని సంబర పడ్డ వివిధ విభాగాల ఉద్యోగులు రెండు…
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పంచాయతీ.. చినికి చినికి గాలి వానలా మారి ఒక రకంగా జిల్లా పార్టీనే షేక్ చేస్తోంది. ఓ ముఖ్య నేత సన్నిహితుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కగా.. మరో ముఖ్య నేత సన్నిహితుని కుమారుడిని ఏకంగా అదుపులోకి తీసుకున్నారు.
Baby For Sale : నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్‌లో ఓ ఆడ శిశువు విక్రయించే ఘటన కలకలం రేపుతోంది. ఐదో సంతానంగా ఆడబిడ్డ పుట్టిందని, తాము పోషించలేమని తల్లిదండ్రులే అమ్మేశారు. రెండు లక్షల రూపాయలకు మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన వ్యక్తికి అమ్మినట్టు తెలుస్తోంది. ముత్యాలమ్మ, వెంకట్రావు అనే దంపతులు ఇప్పటికే నలుగురు పిల్లల తల్లిదండ్రులు. ఐదవ సంతానంగా పుట్టిన ఆడపిల్లను స్థానికుల అనుమానంతో చైల్డ్‌లైన్‌కి ఫిర్యాదు చేశారు. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై కేసు నమోదు…
ఆ ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీ లీడర్స్ చేతులెత్తేశారా? స్థానిక సమరానికి ప్రత్యర్థులు కత్తులు నూరుతుంటే… వాళ్ళ మాత్రం అస్త్ర సన్యాసం చేశారా? యుద్ధానికి మేం సిద్ధమని సైనికులు అంటుంటే… నడపాల్సిన దళపతులు మాత్రం ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు? వాళ్ళకు ఎక్కడ లేడా కొడుతోంది? ఏ జిల్లాలో ఉంది అంత దారుణమైన పరిస్థితి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గులాబీ పార్టీని.. మాజీ ఎమ్మెల్యేలు గాలికొదిలేశారన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఆ విషయమై కేడర్ తీవ్ర ఆందోళనలో…
Tragedy: మద్యానికి బానిసైన కన్నతల్లి ముక్కు పచ్చలారని కన్న కూతురినే కడతేర్చింది. అభం శుభం తెలియని బోసి నవ్వుల చిన్నారిని దుప్పటి కప్పి గొంతు నులిమి చంపేసింది. హృదయాన్ని కలిచివేసే ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఇక్కడ చూడండి.. ఇక్కడ బెడ్‌పై తాపీగా కూర్చున్న మహిళ పేరు రమ్య. ఈమెకు నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పులకు చెందిన గంగోని మల్లేష్‌తో 2 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం అమ్మాయి…
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ.. తమ పొలిటికల్ గాడ్ ఫాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. కార్పొరేషన్ ఛైర్మన్, డీసీసీ అధ్యక్ష పదవుల రేసులో నిలిచినా.. వీళ్ళకు ఆ ఒక్కటి అడ్డొస్తోందట. ఎక్కడికెళ్లినా ఆ తప్పునే గుర్తు చేస్తూ.. ఇద్దరికీ పదవులు రాకుండా అడ్డుపడుతున్నారట సీనియర్ కాంగ్రెస్ నాయకులు.
రాహుల్‌గాంధీపై అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారని.. పాకిస్థాన్ మాట రాహుల్‌గాంధీ నోట వినబడుతోందని మండిపడ్డారు.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని పునరుద్ఘాటించారు. నిజామాబాద్‌లో పసుపుబోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. నక్సలైట్లపై అంశంపై అమిత్‌షా మరోసారి స్పందించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించారు. అనంతరం నిజామాబాద్ కిసాన్ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. నిజామాబాద్ పసుపు రైతులు మరింత వృద్ధిలోకి రావాలని ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ మోడీ సర్కార్ బోర్డ్ ఏర్పాటు చేసింది.. మోడీ ఏది చెప్పినా చేసి తీరతారు.. డీఎస్ గొప్ప రాజకీయ నాయకుడు.. ఆయన విగ్రహం ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉంది.. నిజామాబాద్ పసుపు రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే ఓ ప్రత్యేక…
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించారు. పసుపు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇవాళ తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరిందని చెప్పారు. దేశంలోని పసుపు రైతులకు అభినందనలు తెలిపారు. పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోని పలు దేశాలకు నిజామాబాద్ పసుపు వెళ్తుందని వెల్లడించారు.
Amit Shah: రేపు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. రేపు ఉదయం 11.25 గంటలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానశ్రయానికి చేరుకోనున్నారు.