వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు మహోత్సవం’ నిర్వహిస్తోంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు రైతులకు అందే సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం రైతు మహోత్సవం నిర్వహించ తలపెట్టింది. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు (ఏప్రిల్ 21 నుంచి 23 వరకు) ఈ మహోత్సవం కొనసాగనుంది. ఈ ప్రదర్శనలో దాదాపు 150 స్టాళ్లు నెలకొల్పాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా…
Bandi Sanjay : పాకిస్తానీ చేతిలో దుబాయిలో దారుణంగా హత్యకు గురైన ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ప్రేమ్ సాగర్ తోపాటు హత్యకు గురైన నిజామాబాద్ కు చెందిన శ్రీనివాస్ మృత దేహాలను వీలైనంత తొందరగా స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు మృతుల కుటుంబాలకు అండగా…
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో విషాదం నెలకొంది. షకీల్ తల్లి కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందింది. షకీల్ తల్లి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసిన పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా నేడు అచన్ పల్లిలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఓ అల్లుడు అత్తింటికే కన్నం వేశాడు. అత్త ఇంట్లో అల్లుడు చోరీ చేశాడు. ఆమె ఇంట్లో లేని సమయం చూసి దొంగతనానికి పాల్పడ్డాడు. అందినకాడికి దోచుకెళ్లాడు. ఈ ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రోటరీ నగర్ కు చెందిన సంతోష్ వాళ్ల అత్త ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన అల్లుడు సంతోష్ చోరీకి పాల్పడ్డాడు. Also Read:CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు,…
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం 300 క్వార్టర్లో దారుణం జరిగింది. భర్తతో కలిసి తల్లిని చంపింది ఓ కూతురు. తన కుటుంబ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకుంటుందని తల్లి పై కక్ష పెంచుకుంది.
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందటం పట్ల మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Verity Festival: నిజామాబాద్ జిల్లాలోని సాలూరా మండలం హున్సలో పిడిగుద్దులాట ఆగడం లేదు. హోలీ పండుగ రోజు నిర్వహించే ఆటకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. గ్రామంలోని యువకులు ఈ ఆటను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు.
నిజామాబాద్‌లోని మార్కెట్ యార్డుకు పసుపు పోటెత్తింది. 50 వేల బస్తాలకు పైగా అమ్మకానికి పసుపు రావడంతో రైతులతో మార్కెట్ యార్డ్ మొత్తం సందడిగా మారింది. కనీస మద్దతు ధరతో కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
నిజామాబాద్ జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ... దాన్ని ఎక్కడ పెట్టాలన్న విషయంలో రాజకీయ రాద్ధాంతం నడుస్తున్నట్టు తెలిసింది. కేంద్రం మంజూరు చేసిన స్కూల్‌ను తాను సూచించిన ప్రాంతంలో ప్రారంభించమని పట్టుబడుతున్నారట నిజామాబాద్ ఎంపీ అర్వింద్. జక్రాన్ పల్లి మండలం కలిగోట్‌లో పెట్టాలంటూ... ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారట ఎంపీ.
నిజామాబాద్ మార్కెట్ యార్డులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ పై కార్మికులు దాడికి పాల్పడ్డారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకుని మరి కార్మికులు దాడి చేశారు. పసుపు దొంగతనం ఆరోపణలు నిరసిస్తూ పసుపు కాంటాలు నిలిపివేసి కార్మికులు ఆందోళన చేపట్టారు.