ఏప్రిల్ 7, 8 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు వల్ల 83 మంది బాధితులు ఆస్పత్రి పాలయ్యారని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు. ఆల్ఫాజోలం కలిపినా కల్లు తాగడం వల్ల అస్వస్థత లోనయ్యారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీజీఎన్‌ఏబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కల్తీ కల్లుపై తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావించినట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమాల కోసం 26 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.