పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న జనం ముందుకు వస్తోందని తెలిసినప్పటి నుంచీ అభిమానుల్లో సంబరం మొదలయింది. ఈ సినిమా రిలీజ్ నాటికి ఏపీ గవర్నమెంట్ ప్రదర్శన ఆటలు, టిక్కెట్ రేట్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటుందని భావించారు. కానీ, ఎప్పటిలాగే పరిమిత ప్రదర్శనలు, మునుపటి రేట్లతోనే సాగాలని ప్రభుత్వం ఆదేశించడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ పలు రికార్డులు బద్దలు చేస్తుందని, నిర్మాతలకు, కొనుగోలుదారులకు…
పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. తెలంగాణలో ఈ మూవీ టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం ఇవ్వడంతో పాటు ఐదు షోస్ వేసుకోవడానికి అనుమతి కూడా ఇచ్చింది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ అదనపు ఆటలు వేయడాన్ని, టిక్కెట్ రేట్లను పెంచి అమ్మడాన్ని ఎంత మాత్రం సహించమని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై తెలుగు…
సూపర్ హిట్ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ అధికారిక రీమేక్ “భీమ్లా నాయక్”. ‘భీమ్లా నాయక్’లో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, బ్రహ్మాజీ, రఘుబాబు, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలుపోషిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు టీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ ట్విటర్‌లోకి వెళ్లి “భీమ్లా నాయక్” టీమ్ గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. “నా సోదరులు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, తమన్, దర్శకుడు సాగర్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోమవారం జరగాల్సిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా ఫిబ్రవరి 23కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక జరగనుంది. పవన్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఈవెంట్ కు అభిమానులు భారీగా తరలిరానున్నారు. అయితే ఇంతకుముందు ఇదే వేదికగా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం “అయ్యప్పనుమ్ కోశియుమ్” తెలుగు రీమేక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రధాన నటీనటులతో పాటు సాంకేతిక బృందం కూడా ఎంతెంత రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారు ? అనే విషయంపై…
పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే బోలెడు క్రేజ్. ఇక రానా కూడా కలిస్తే? డబుల్ జోష్! అటువంటి ఫుల్ జోష్ లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరో అప్ డేట్ ఉత్సాహాన్నిచ్చింది. పవన్, రానా మల్టీ స్టారర్ మలయాళ రీమేక్ లో మల్లూ బ్యూటీ నిత్యా మీనన్ నటించబోతోంది! సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని తమ అధికార సోషల్ మీడియా అకౌంట్లో అఫీషియల్ గా ప్రకటించింది. పవన్ పోలీస్ గా, రానా ఆర్మీ…