పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే బోలెడు క్రేజ్. ఇక రానా కూడా కలిస్తే? డబుల్ జోష్! అటువంటి ఫుల్ జోష్ లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరో అప్ డేట్ ఉత్సాహాన్నిచ్చింది. పవన్, రానా మల్టీ స్టారర్ మలయాళ రీమేక్ లో మల్లూ బ్యూటీ నిత్యా మీనన్ నటించబోతోంది! సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని తమ అధికార సోషల్ మీడియా అకౌంట్లో అఫీషియల్ గా ప్రకటించింది. పవన్ పోలీస్ గా, రానా ఆర్మీ మ్యాన్ గా రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేస్తోన్న సినిమాకి సాగర్ చంద్ర డైరెక్టర్.
Read Also : లీకైన వెడ్డింగ్ కార్డ్… షాకైన ఆర్జీవీ… క్లారిటీ ఇచ్చిన సుమంత్!
మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తోన్న పవన్, రానా మూవీకి మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ ఆధారం. అదే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనులతో బిజీగా ఉన్న సితారా ఎంటర్టైన్మెంట్స్ టీమ్ సంక్రాంతికి సినిమాని ప్రేక్షకుల ముందుకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. అయితే, పవన్ , రానా స్టారర్ కి ఇంకా టైటిల్ డిసైడ్ చేయలేదు. ప్రొడక్షన్ నంబర్ 12గా వ్యవహరిస్తున్నారు. అలాగే, 2021 జనవరిలో… సంక్రాంతి వేళ… ఏ తేదీన మూవీ రిలీజ్ అవుతుందో కూడా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది.