పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం “అయ్యప్పనుమ్ కోశియుమ్” తెలుగు రీమేక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రధాన నటీనటులతో పాటు సాంకేతిక బృందం కూడా ఎంతెంత రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారు ? అనే విషయంపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజా బజ్ ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం రెమ్యునరేషన్‌గా రూ .50 కోట్లు తీసుకుంటున్నారు.
Read Also : క్యూట్ లుక్ లో బుట్టబొమ్మ… పిక్స్ వైరల్
రానా దగ్గుబాటి సెకండ్ లీడ్ హీరో రూ.5 కోట్లు అందుకుంటున్నారు. సంగీత స్వరకర్త థమన్ 3 కోట్లు, సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ 2 కోట్లు వసూలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు నిత్యా మీనన్ అతి తక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. “భీమ్లా నాయక్” లో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నటించడానికి నిత్యా మీనన్ రూ .80 లక్షల రెమ్యూనరేషన్ వసూలు చేస్తోంది.
మలయాళం ఒరిజినల్ నుండి రానా దగ్గుబాటి, పవన్ కళ్యాణ్ వరుసగా బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను తిరిగి చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో విలన్‌గా నటించిన సముద్రకని ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో నిత్యామీనన్ ‘భీమ్లా నాయక్’ భార్యగా నటిస్తోంది. ఈ విషయాన్నీ మేకర్స్ జులై 30 న ప్రకటించారు.