Bihar elections: బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీయే పార్టీలో పొత్తులు కూడా పూర్తయ్యాయి. మొత్తం 243 సీట్లకు గానూ బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తుంగా, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ(రామ్ విలాస్) 29 స్థానాల్లో పోటీ చేయనుంది. మిగిలిన స్థానాలు ఎన్డీయే మిత్రపక్షాలకు దక్కాయి.
Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాశ్వాన్‌ల ఎన్డీయే కూటమి సీట్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాలో పోటీ చేయనున్నాయి. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి 29 సీట్లు దక్కాయి. రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) చెరో ఆరు సీట్లలో పోటీ చేస్తాయి. 2020 బీహార్ ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో…
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఎన్డీయే, మహాఘటబంధన్ కూటములు సీట్ల షేరింగ్‌పై చర్చోపచర్చలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 243 మంది సభ్యులు కలిగిన బీహార్ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 22తో ముగుస్తుంది. రెండు విడతల్లో ఎన్నిలకలు నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిపారు. నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్ పోలింగ్,11న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తొలిదశ పోలింగ్ కు ఈ నెల 10న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నవంబర్ 14న కౌంటింగ్ చేపట్టనున్నట్లు వెల్లడించారు.…
BJP: రాబోయే బీహార్ ఎన్నికల్లో బురఖా ధరించిన ఓటర్లను చెక్ చేయాలని బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆర్జేడీ ఆరోపించింది. పోలింగ్ బూతుల్లో బురఖా ధరించిన మహిళల్ని ధ్రువీకరించాలని నిన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో జరిగిన సమావేశంలో బిజెపి చీఫ్ జైస్వాల్ కోరారు.
ప్రధాని మోడీ సోమవారం బీహార్‌లోని పూర్ణియాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బెదిరించేందుకే కేంద్రం తొలగింపు బిల్లు తీసుకొచ్చిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీహార్‌లో ఏడాది చివరి కల్లా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
Chirag Paswan: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితులపై ఎన్డీయేలోని మిత్రపక్షాలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల, బీహార్ వ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు సంబంధించిన సంఘటనలు సంచలనంగా మారాయి. తాజాగా, అంబులెన్స్‌లో ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన బీహార్ రాజకీయాలను కుదిపేస్తోంది. బీజేపీ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, సీఎం నితీష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం…
Tejashwi Yadav: మరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగబోతోంది. ఇప్పటికే, పాలక బీజేపీ-జేడీయూ కూటమితో పాటు ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్‌లు ప్రచారాన్ని మొదలుపెట్టాయి., మరోవైపు, కేంద్ర ఎన్నికల సంఘం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ ద్వారా ఫేక్ ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై ఆర్జేడీ, కాంగ్రెస్‌తో సహా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఓటర్ల జాబితాను ఎన్డీయేకు అనుకూలంగా మార్చడానికి ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ…