Bihar Elections: బీహార్ ఎన్నికలకు సమీపం దగ్గర పడుతున్నా కొద్ది రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా, బీజేపీ తన అభ్యర్థుల రెండో లిస్టును రిలీజ్ చేశాయి. 12 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. అందరి దృష్టిని ఆకర్షించిన జానపద గాయని మైథిలి ఠాకూర్ పేరు కూడా సెకండ్ లిస్టులో ఉంది. ఆమె రెండు రోజుల క్రితమే బీజేపీలో చేరింది. మైథిలి ఠాకూర్ అలీనగర్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు.
Read Also: Afghan-Pak War: ఆఫ్ఘాన్-పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత.. సాధారణ పౌరులపై పాక్ దాడులు..
రెండో జాబితాలో ఉన్న కీలక వ్యక్తుల్లో బక్సర్ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా ఉన్నారు. ఈయనతో పాటు రోస్రా నుంచి వీరేంద్ర కుమార్, చాప్రా నుంచి చోటి కూమారి ఉన్నారు. బీజేపీ రెండో జాబితాలో ఎక్కువ మంది కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చింది. మిథిలాంచల్‌లో బీజేపీ క్రేజ్ సంపాదించుకోవడానికి మైథిలీ ఠాకూర్‌ను బరిలోకి దింపింది. 243 మంది సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కౌంటింగ్ నవంబర్ 14న జరుగుతుంది.