తాజాగా ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో బీహార్‌కి గణనీయమైన నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
పేపర్ లీకేజీ వ్యవహారాలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. ఏదొక రాష్ట్రంలో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం నిర్వహించిన నీట్ ఎగ్జామ్ పేపర్ కూడా లీకేజీ కావడం పెను సంచలనంగా మారింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సమయంలో లాలూకి చెందిన ఆర్జేడీ పార్టీ మహిళా ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ సభలో నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చర్చ జరిగే సమయంలో ఎమ్మెల్యే రేఖాదేవిపై సీఎం ఫైరయ్యారు. ఆర్జేడ�
బీహార్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పిన నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ నుంచి నితీష్ కుమార్ బయటకు రావాలని.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
CM Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ వార్తల్లో వ్యక్తిగా మారారు. మౌలిక సదుపాయాల పనుల్ని వేగవంతం చేయాలని కోరుతూ, నితీష్ చేతులు జోడించి వేడుకోవడం వైరల్‌గా మారింది.
Tejashwi Yadav: బీహార్ రాష్ట్రంలో వరసగా వంతెనలు కూలిపోతున్నాయి. తొమ్మిది రోజుల వ్యవధిలోని వివిధ ప్రాంతాల్లోని 5 వంతెనలు కుప్పకూలాయి. దీంతో బీహార్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వంతెనల కూలిన ఘటనపై జేడీయూ-బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
Bihar Reservations: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రికి పాట్నా హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం కుల ఆధారిత సర్వే నివేదిక ఆధారంగా ఓబీసీ, ఈబీసీ, దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచింది.
ఆదివారం కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. మిత్రపక్షాల మద్దతుతో మోడీ.. సర్కార్‌ను నెలకొల్పారు. ఎవరికి దక్కాల్సిన పదవులను వారికి పంచేశారు. అయితే ఇదంతా ఒకెత్తు అయితే.. అసలు సిసలైన మరో పోస్టు.. ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకంగా మారింది.