Nithiin: సినిమాలు- రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయ నేతలు సినిమాల్లో రాణించిన దాఖలాలు లేవు కానీ, సినిమా రంగం నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో రాణిస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఇక ఆ కోవలోకి యంగ్ హీరో నితిన్ కూడా వస్తున్నాడా..? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. గతేడాది నితిన్ తో బీజేపీ నేత జేపీ నడ్డా భేటీ అయిన విషయం తెల్సిందే.