Nithiin: రాజకీయాల్లోకి హీరో నితిన్ ఎంట్రీ.. అక్కడి నుంచే పోటీ.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithiin: సినిమాలు- రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయ నేతలు సినిమాల్లో రాణించిన దాఖలాలు లేవు కానీ, సినిమా రంగం నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో రాణిస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఇక ఆ కోవలోకి యంగ్ హీరో నితిన్ కూడా వస్తున్నాడా..? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. గతేడాది నితిన్ తో బీజేపీ నేత జేపీ నడ్డా భేటీ అయిన విషయం తెల్సిందే. ఎన్నికలు దగ్గరపడుతుండం, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా అస్సలు లేకపోవడంతో బీజేపీ నేతలు.. స్టార్ హీరోలను తమ ప్రచారాలకు రమ్మని పిలవడానికి ఈ భేటీలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే నితిన్.. సున్నితంగా బీజేపీకి ప్రచారం చేయడానికి ఇష్టం లేదని చెప్పుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే నితిన్ బీజేపీ కి కాకుండా కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నాడని సమాచారం. అయితే నితిన్ రాజకీయాల్లోకి రావడం వాస్తవమే కానీ, ఆయన పోటీ చేయకుండా.. ఆయన మేనమామ నగేష్ రెడ్డిని నిలబెట్టనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Eesha Rebba: ఎవరి కోసం పాప.. గుమ్మం ముందు అంతలా ఎదురుచూస్తున్నావ్
Also Read
- Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
- Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
- Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
- Rowdy Janardhana: పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్‌లో విజయ్ దేవరకొండ సినిమా?
నగేష్ ఎప్పటినుంచో కాంగ్రెస్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే ఆయన రేవంత్ రెడ్డి తో భేటీ కూడా అయ్యారట. నితిన్ వాళ్ళ సొంత ఊరు నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుంచే నగేష్ ను పోటీ చేయించాలని నితిన్ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టికెట్ విషయమై రేవంత్ రెడ్డితో నగేష్ చర్చలు జరుపగా.. సర్వేలను బట్టే టికెట్ ఇస్తారని రేవంత్ చెప్పినట్లు సమాచారం. దీంతో నగేష్ కోసం నితిన్ రంగంలోకి దిగినట్లు టాక్. ఆ టికెట్ కోసం నితిన్ చాలా కష్టపడుతున్నాడట. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక నితిన్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆయన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
-
Piyush Goyal : వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలి
-
OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
-
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
-
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?