రెండో విడత మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇది ఆఖరి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్. వివేకవంతంగా వనరుల వినియోగం, ధరలు పెరగకుండా అభివృధ్ది సాధించేలా ప్రణాళికలు రూపొందించడం, ప్రజలపై పన్నుల భారం మోపకుండా మరిన్ని వనరులను సమకూర్చుకోవడం, అవసరమైన చోట వరాలు కురిపించడం లాంటి లక్ష్యాలను సాధించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేయడమే ‘బడ్జెట్ రూపకల్పన’ అని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టే ఈ పూర్తిస్థాయి బడ్జెట్ ఆఖరిది కాబట్టి, నెలవారీ జీతం పొందే ఉద్యోగులకు, చిరు వ్యాపారులకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను మినహాయింపులు ప్రకటించే అవకాశం ఉంది. గృహ రుణాల పరిమితిని పెంచాలనే డిమాండ్ బాగా ఉంది. సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు చాలామందికి ఇది ప్రోత్సాహాన్నిస్తుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఊతం వస్తుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవతాయని అంచనా.దేశ ఆర్ధికవృధ్ది రేటు 6.8 శాతం సాధించే లక్ష్యంగా ఈ ఏడాది పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్.
ఆదాయపు పన్ను విధింపులో 2014 లో ప్రవేశపెట్టిన “శ్లాబ్ పధ్దతి”, ఆ తర్వాత 2017-18 నుంచి పన్ను శాతంలో ఎలాంటి మార్పులు లేవు. దేశంలోని మధ్యతరగతి ప్రజలు ఈ ఏడాది బడ్జెట్ లో ఎంతో కొంత ఆదాయపు పన్ను లో మినహాయింపులు ఉంటాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు. నిర్దేశించుకున్న ఆర్ధిక వృధ్ది రేటును సాధించేందుకు ఈ బడ్జెట్ తో పునాదులు వేయనున్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి. పెద్దగా ప్రజాకర్షక బడ్జెట్ ఉండకపోవచ్చని అంచనా. అయితే సమతుల్యంతో ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉందంటున్నారు.
1.25 నిమిషాలు బడ్జెట్ ప్రసంగం చదివిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఫైనాన్స్ బిల్లు 2023 ప్రవేశపెట్టిన నిర్మలమ్మ. గురువారం 2 ఫిబ్రవరి ఉదయం 11 గంటలకు వాయిదాపడిన లోక్ సభ.
5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచిన ఐటీ లిమిట్. ఏడులక్షల వరకూ ఎలాంటి పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ శ్లాబ్స్ 7 నుంచి 5 కి తగ్గింపు. వేతన జీవులకు ఊరట కల్పించారు.
0-3 నో ట్యాక్స్
3-6 5 శాతం
6-9 10 శాతం
9-12 15 శాతం
12-15 20 శాతం
15 లక్షలు మించితే 30 శాతం
సిగరెట్లపై బాదుడు. టీవీ ప్యానెళ్ళపై కస్టమ్స్ డ్యూటీ 2.5 శాతం తగ్గింపు.. లిధియం బ్యాటరీలపై కస్టమ్స్ డ్యూటీ 21 నుంచి 13 శాతానికి తగ్గింపు. పెరగనున్న గోల్డ్, డైమండ్, సిల్వర్ ధరలు. వీటిపై కస్టమ్స్ డ్యూటీ పెంపు. భారీగా తగ్గనున్న టీవీలు, మొబైల్స్, ఎలక్ట్రానిక్ ధరలు. ధరలు తగ్గే వస్తువులు . భారీగా తగ్గనున్న ఎలక్ట్రికల్ వస్తువుల ధరలు. వజ్రాలు, ఎల్ ఈడీ టీవీల ధరలు. మొబైల్ ఫోన్లు, రెడీమేడ్ చిమ్నీల ధరలు తగ్గనున్నాయి. మరోవైపే పెరగనున్న బట్టల ధరలు.
ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్
►సమ్మిళిత అభివృద్ధి
►చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు
►భారీగా పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు
►దేశ ప్రజల సామర్థ్యానికి పెద్ద పీట
►పర్యావరణ అనుకూల అభివృద్ధి
►యువ శక్తి
►పటిష్టమైన ఆర్థిక రంగం
త్వరలో ఎన్నికలు జరగనున్న కర్నాటక కు ప్రాధాన్యత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కర్ణాటకలోని కరువు ప్రాంతాల అభివృద్ధికి రూ.5300 కోట్ల కేంద్ర సాయం
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం రూ.19,700 కోట్లు
►ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం రూ.38వేల కోట్లు
►లడఖ్‌లో 13 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ.20,700 కోట్లు
►గోబర్ధన్ స్కీమ్ కింద 200 బయోగ్యాస్ ప్లాంట్లు
నేషనల్ సెక్యూరిటీ మార్కెట్లో అవకాశాలు పెంచుతాం. వివిధ కోర్సులు తెస్తాం. సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుచేస్తాం. ఫీల్డ్ ఆఫీసర్ల వ్యవస్థ. పెట్టుబడి దారులకు మరింత సౌకర్యం కల్పించేలా చర్యలు. ఐటీ పోర్టల్ ఏర్పాటుచేస్తాం. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మహిళా సమ్మాన్ పత్ర అందుబాటులోకి తెస్తాం. 2 లక్షల దాకా డిపాజిట్ చేసుకోవచ్చు. 7.5 శాతం వడ్డీ ఇస్తాం. సీనియర్ సిటిజన్ల డిపాజిట్ లిమిట్ 15 లక్షల నుంచి 30 లక్షలకు పెంచాం. 15 ఏళ్ళ పాటు రాష్ట్రాలు ఎలాంటి వడ్డీ లేకుండా నిధులు వినియోగించుకోవచ్చు.
టూరిజం మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. దేశంలో సరిహద్దు గ్రామాల టూరిస్ట్ సెంటర్లుగా చేస్తాం. గోబర్ధన్ స్కీం కింద 200 బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటుచేస్తాం. వాహనాల తుక్కు కోసం మరిన్ని నిధులు కేటాయిస్తాం. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం పారదర్శక విధానం తెస్తాం. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తెస్తాం. ఫండ్ ట్రాన్స్ ఫర్ చేయించడానికి సులభతరం చేస్తాం. బ్యాంకింగ్ సంస్కరణలు తెస్తాం.
కోస్తా ప్రాంతంలో మొక్కల పెంపకంపై ఫోకస్. మిస్టీ అనే పథకం ద్వారా కోస్తా ప్రాంతాలపై దృష్టిపెడతాం. బయో డైవర్సిటీ, స్థానికులకు ఉపాధి కల్పించడం. వయబిలిటీ గ్యాపింగ్ ఫండ్. వెహికల్స్ స్క్రాపింగ్ పై దృష్టి పెడతాం. ప్రధాన మంత్రి కౌశల్ యోజన 4.0 ద్వారా నైపుణ్య అభివృద్ధి చేస్తాం. యూనిఫైడ్ స్కిల్లింగ్ ప్రాగ్రాం. స్టయిఫండ్ స్కీం ద్వారా లక్షలాదిమంది యువతకు అప్రెంటిస్ ద్వారా అందించాం. టూరిజం అభివృద్ధి ద్వారా విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటాం.మడఅడవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.
దేశంలో కేవైసీ విధానాలు మార్చాలి. ఆధార్, పాన్ అన్నిచోట్ల ఉపయోగించాలి. అన్ని ప్రభుత్వ సంస్థల్లో ఒకే రకమయిన సర్టిఫికెట్లు వుండాలి. ఎంఎస్ఎంఈలు ఫెయిల్ అయితే వాటిని బయటకు తీసుకురావాలి. రైల్వేలకు 2 లక్షల 40 వేల కోట్లు కేటాయించారు. 50 ఎయిర్ పోర్టుల పునరుద్ధరణ. ట్రాన్స్ పోర్ట్ రంగానికి ప్రాధాన్యత. ఈ కోర్టుల ద్వారా 7000 కోట్లు కేటాయిస్తున్నాం.దేశంలో 5 జీ టెక్నాలజీ పెంచుతాం. స్మార్ట్ క్లాస్ రూంలు, విద్యావ్యవస్థలో దీనిని వాడతాం. ఐఐటీల్లో పరిశోధనకు సాయం అందిస్తాం. 2013-14తో పోలిస్తే రైల్వేలకు 9 రెట్లు నిధులు కేటాయించాం అన్నారు. సాగు, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల కోసం కృత్రిమ మేథ అభివృద్ధి. ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు. డిజిటల్ ఇండియాకు అనుగుణంగా వన్‌స్టాప్ ఐడెంటిటీ కేవైసీ విధానం కావాలి. చిరువ్యాపారులకు కూడా పాన్ తప్పనిసరి.
రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేస్తాం. నగరాలు, రాష్ట్రాల్లో భూములను అందుబాటులోకి తెస్తాం. సిటీల అభివృద్ధి చేస్తాం. అర్బన్ ఇన్ ఫ్రాక్చర్ ఫండ్ ద్వారా నిధులు ఇస్తాం. టయర్ 2, టయర్ 3 సిటీలను ఇందులో చేరుస్తాం. అన్ని నగరాలు, పట్టణాల్లో మేన్ హోల్, మెషిన్ హోల్ సెఫ్టిక్ ట్యాంకులను శుభ్రపరుస్తాం. గుడ్ గవర్నెన్స్ కావాలని ప్రధాని కోరుకున్నారు. మిషన్ కర్మయోగి రాష్ట్రాలు, కేంద్రపాలి ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు ఆన్ లైన్ ట్రైనింగ్ ఇస్తాం. లక్షలాదిమంది తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ఉపయోగపడేలా పనిచేయాలి. ఆర్టీఫీసియల్ ఇంటెలిజెన్స్, వివిధ సంస్థల్లో వీటిని అభివృద్ధి చేస్తాం. వ్యవసాయ రంగంసై ఏఐ వాడుకోవాలి. పరిశోధనలు పెరగాలి.
కొవిడ్ సమయంలోనూ ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశాం
ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతోంది
వంద కోట్లమందికి 220 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించాం
భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పయనిస్తోంది
గిరిజనులకు వివిధ సౌకర్యాలు కల్పించాలని 50 వేల కోట్లు కేటాయించాం. షెడ్యూల్ తెగలకు సాయం అందిస్తాం.ఏకలవ్య స్కూళ్ళలో 38,800 టీచర్లను 740 స్కూళ్లో నియమిస్తున్నాం. పీఎం ఆవాజ్ యోజన పెంచాం. జైళ్ళలో ఉండే పేద ఖైదీలకు బెయిల్ పొందేందుకు సాయం అందిస్తాం. వ్యవసాయంలో ఆధునీకరణకు కట్టుబడి ఉన్నాం.
మత్స్యకారుల అభివృద్దికి కట్టుబడి ఉన్నాం. సహకారం ద్వారానే సమృద్ధి సాధిస్తాం అన్నారు. పీఏసీఎస్ ని మరింత అభివృద్ది చేస్తున్నాం. సహకార సంఘాలను ప్రగతి పథంలో నడిపిస్తాం. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంలకు 2 వేల కోట్లు కేటాయించాం. మహిళ కోసం మరిన్ని పథకాలు ప్రారంభిస్తున్నాం. నర్సింగ్ కాలేజీలు ప్రారంభించాం. ఇవన్నీ కోర్ లొకేషన్ లో ఏర్పాటుచేశాం. సింగిల్ సెల్ ఎనీమియా నివారణకు కట్టుబడి ఉన్నాం. 0-40 ఏళ్ళ వారికి ముఖ్యంగా గిరిజనులకు మంచి ఆహారం అందిస్తాం. ఐసీయంఆర్ ల్యాబ్ లు ఏర్పాటుచేస్తున్నాం. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రాధాన్యతా రంగాలకు సంబంధించి మరిన్ని నిధులు అందిస్తాం. టీచర్ల ట్రైనింగ్ ఇస్తున్నాం. ఐసీటీ అమలు చేస్తున్నాం. యువతీ యువకుల కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుచేస్తున్నాం.
సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. దేశంలో అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి చేయూత నిస్తాం. జమ్మూకాశ్మీర్, లఢాక్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పంటల దిగుబడి, బీమాకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆగ్రిటెక్, స్టార్టప్ లకు ప్రాముఖ్యం ఇస్తున్నాం. అగ్రి స్టార్టప్ లకు చేయూత నిస్తాం. ఫండింగ్ చేస్తున్నాం. ఆత్మనిర్బర భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం. తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. దేశంలో తృణధాన్యాలకు పెద్ద పీట వేస్తున్నాం. తృణధాన్యాల ఉత్పత్రిలో మనం ముందున్నాం. ఎగుమతుల్లో మనం ముందున్నాం. తృణధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆహారం వందల ఏళ్ళ నుంచి వస్తోంది. చిన్న రైతులు తృణధాన్యాలు పండించాలని నిర్ణయించాం. శ్రీ అన్న రిసెర్చ్ చేయిస్తున్నాం.
దేశంలో గత 9 ఏళ్ళలో తలసరి ఆదాయం రెట్టింపు అయింది. అంతర్జాతీయ సవాళ్లకు అనుగుణంగా మనం మారుతున్నాం. వృద్ధిరేటు 7శాతం గా ఉంది. జీ20 అధ్యక్ష బాధ్యతలతో భారత్ తన ప్రత్యేకతను చాటుకుంది. ఈపీఎఫ్ లో సభ్యులు రెట్టింపు అయ్యారు. దేశంలో టూరిజం అభివృద్ధి జరుగుతోంది. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ గ్రోత్ జరుగుతోంది. గ్రీన్ జాబ్ అవకాశాలు కూడా పెరిగాయి. దేశంలో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి.
9 ఏళ్ళలో మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 10వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకుంది. దేశంలో డిజిటల్ పేమెంట్స్ బాగా పెరిగాయి. అనేక పథకాలు సమర్థంగా అమలుచేస్తున్నాం. 11.07 కోట్ల మరుగుదొడ్లు కట్టాం. 9.6 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. పీఎం సురక్ష బీమా, జీవన జ్యోతి యోజన ద్వారా 40 కోట్ల మందికి కవరేజ్ చేశాం.
అమృతకాలంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. అన్ని వర్గాలకు సంబంధించిన బడ్జెట్ ఇది. 75 ఏళ్ళ ఆజాదీకా అమృత్ మహోత్సవ కాలంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో బలమయిన ఆర్థిక వ్యవస్థ మనది. ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను. దేశంలో కోవిడ్ వైరస్ ని అంతమొందించాం. మన టీకాలు ప్రపంచానికి మార్గం చూపాయి. ఉచిత ఆహార ధ్యానాలు 28 నెలల పాటు ఉచితంగా అందించాం. దేశం వృద్ధి రేటు వేగంగా పెరుగుతోంది. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచదేశాలు గుర్తించాయి.
తన ఐదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్దమయ్యారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పేపర్‌లెస్ ఫార్మాట్‌లోనే బడ్జెట్ వుంది. 2018 దాకా లెదర్ సూట్‌కేస్‌లోనే పార్లమెంట్‌కు తీసుకొచ్చేవారు. కానీ 2019 నుంచి నిర్మలమ్మ ఈ సంప్రదాయానికి చెక్ పెట్టారు. ఆర్థిక మంత్రిగా ఆ ఏడాది తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. వాటి తాలూకు ప్రతుల్ని ‘బాహీ ఖాతా’గా పిలిచే ఎరుపు రంగు క్లాత్ బ్యాగ్‌లో తీసుకొచ్చారు.
దీనిపై జాతీయ చిహ్నం కూడా అమర్చారు. తద్వారా భారతీయ సంస్కృతికి తెర తీశారామె. ‘ఇకనైనా బ్రిటిష్ సంస్కృతికి చరమగీతం పాడి.. భారతీయ సంప్రదాయానికి తెరతీద్దాం.. పైగా బాహీ ఖాతా ద్వారా బడ్జెట్ ప్రతుల్ని మోసుకురావడం కూడా చాలా సులువు..’ అంటూ రెండేళ్ల పాటు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించిన నిర్మలమ్మ.. 2021లో డిజిటల్ బడ్జెట్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.
కాసేపటి క్రితం పార్లమెంట్ కు చేరుకున్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ ఆమోదం కోసం కేంద్ర మంత్రిమండలి సమావేశం అయింది. కేంద్ర కాబినెట్ ఆమోదం తర్వాత సమావేశం నుంచి బయటకు వచ్చారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్.
