రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి మెజారిటీ వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మిగులు ఆదాయంలో ఉన్న తెలంగాణ అప్పుల పాలయిందని, తెలంగాణ లో ప్రభుత్వం మారింది,కానీ ఇప్పటికీ ఉచితలు సంస్కృతి ఇంకా ఉంది,కాంగ్రెస్ అవినీతి కూడా పెద్ద ఎత్తున్న మొదలవుతుందన్నారు నిర్మలా సీతారామన్. తెలంగాణలో బీజేపీ కి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని, రెండు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి మెజారిటీ వస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఏపీలో…
Prajwal Revanna Case: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కర్ణాటకలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ప్రజ్వల్‌తో పాటు అతని తండ్రి హెచ్డీ రేవణ్ణపై మహిళ లైంగిక వేధింపులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో పాటు హసన్ జిల్లాలో ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి.
Asaduddin Owaisi: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నయన్నారు.
అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అమరావతిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతో ప్రధాని కార్యాలయం నుంచి ఆర్బీఐకి వివరాలు పంపమని లేఖను పంపడం జరిగింది. అందులో భాగంగా బుధవారం నాడు ఆర్బీఐ నుంచి రిజిస్టర్ పోస్టులో ఉత్తర్వులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుమేట్ జావాడే నుంచి లేఖను అందుకున్నారు. Also…
రాష్ట్రానికి అన్యాయం చేసిందని కేంద్రాన్ని నిందించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. రాష్ట్రానికి రావాల్సిన కరువు సహాయ నిధుల విడుదలలో జాప్యాన్ని అంగీకరించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇవాళ ( సోమవారం ) తొలిసారి భేటీ అయింది. సీనియర్ బీజేపీ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల మేనిఫెస్టో కమిటీలో పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి నలుగురు ముఖ్యమంత్రులతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు.
Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మతపరమైన భావాలను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఆమె ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంగించారని డీఎంకే ఫిర్యాదులో పేర్కొంది. ‘‘ఎంకే స్టాలిన్ పార్టీ దేవాలయాల నుంచి డబ్బును దొంగిలించి హిందూ మతాన్ని నాశనం చేస్తుంది’’ అని ఆమె ఇటీవల ఆరోపించారు. డీఎంకే పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె…
ఎలక్టోరల్ బాండ్లపై దేశంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ విషయంలో సుప్రీంకోర్టు కఠినమైన తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ని జాబితాలను బహిరంగపరచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల తర్వాత, ఎన్నికల విరాళాలు ఇచ్చే కంపెనీల జాబితా, స్వీకరించే పార్టీల విరాళాల జాబితాను ఎన్నికల సంఘం బహిరంగపరిచింది.