Budget 2024: రేపు ప్రవేశ పెట్టే సాధారణ బడ్జెట్లో కొత్త పెన్షన్ సిస్టమ్, ఆయుష్మాన్ భారత్ వంటి సామాజిక భద్రత సంబంధిత పథకాలకు సంబంధించి కొన్ని ప్రకటనలు ఉండవచ్చు.
కేంద్ర బడ్జెట్ సందర్భంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించే హల్వా వేడుక ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో మంగళవారం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్-2024-25 ప్రక్రియ చివరి దశకు రావడంతో జరిగిన ఈ హల్వా తయారీ వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు చిరాగ్ పటేల్ అనే వ్యక్తిపై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. కేంద్రమంత్రిపై ఉద్దేశపూర్వకంగా డీప్‌ఫేక్ వీడియో చేసినట్లుగా హర్ష్ సంఘవి పేర్కొన్నారు.
త్వరలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో అటల్ పెన్షన్ దారులకు శుభవార్త చెప్పే యోచనలో ఉంది. కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి.
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) 17 స్థానిక పన్నులు, 13 రకాల సెస్‌లను కేవలం ఐదు భాగాలుగా విభజించడం ద్వారా మొత్తం పన్ను వ్యవస్థను చాలా సులభతరం చేసింది. జూలై 1, 2017 నుంచి జీఎస్టీ అమలు చేయబడింది. గత 6 సంవత్సరాలలో సామాన్య ప్రజలు ఉపయోగించే కొన్ని ఉత్పత్తులు, సేవలపై పన్నులు తగ్గించబడ్డాయి.
Kallakurichi hooch tragedy: తమిళనాడు కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం కాటుకు 50 మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ విషాద ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విచారం వ్యక్తం చేశారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రధాని మోడీ సందేశాన్ని నిర్మలా సీతారామన్ అందించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సొంత పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌తో సీఎం నివాసంలో జరిగిన గొడవ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు.