Union Budget 2024 LIVE UPDATES: అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాకారం దిశగా అడుగులేస్తోన్న కేంద్ర సర్కార్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి సమర్పిస్తున్న బడ్జెట్ ఇది. కేంద్ర బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్..
లోక్‌సభలో 2024-25 వార్షిక బడ్జెట్.. రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్.. 2024-25 బడ్జె్‌ట్ అంచనాలు రూ.32.07 లక్షల కోట్లు.. పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు.. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు.. ద్రవ్యలోటు 4.9 శాతం.. విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు.. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు.. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు.. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.. అర్బన్ హౌసింగ్ కోసం రూ.2.2 లక్షల కోట్లు.
స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంపు.. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఊరట.. పాత పన్ను విధానంలో మార్పులు చేయని ఆర్థిక మంత్రి
కొత్త పన్ను విధానంలో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం.. సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా.. రూ.3-7 లక్షల వరకు 5 శాతం ట్యాక్స్.. రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను.. రూ.10-12 లక్షల వరకు 15 శాతం ట్యాక్స్.. రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను.. రూ.15 లక్షల పైన 30 శాతం ట్యాక్స్.. కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా
స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ షాక్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. 800 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్.. 250 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ..
లాంగ్ టర్మ్ గెయిన్స్‌పై 12.5 శాతం పన్ను విధింపు.. క్యాపిటల్ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు.. స్టార్టప్‌లకు ప్రోత్సాహకం.. ఏంజెల్ ట్యాక్స్ రద్దు
2024-25 బడ్జెట్ అంచనాలు రూ. 32.07 లక్షల కోట్లు..
జీఎస్టీ వల్లే సామాన్య ప్రజలపై భారం తగ్గింది.. మరింత సరళంగా, హేతబద్దంగా జీఎస్టీని మార్చుతాం.. ఐటీ ఫైలింగ్ గడువు దాటినా నేరం కాదు..
ఈ- కామర్స్ సంస్థలకు టీడీఎస్ తగ్గింపు.. ఆన్ లైన్ షాపింగ్ లో తగ్గనున్న ధరలు..
మొబైల్, మొబైల్ యాక్ససిరీస్ పై 15 శాతం డ్యూటీ తగ్గింపు.. 20 రకాల ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు.. బంగారం, వెండిపై 6 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.. క్యాన్సర్ ట్రీట్ మెంట్ లో ఉపయోగించే మరో 3 మందులకు కస్టమ్ డ్యూటీ మినహాయింపు.. మేడిన్ ఇండియా మెడికల్ పరికరాలపై ఫోకస్.. ప్లాస్టిక్ పై కస్టమ్ డ్యూటీ పెంపు..
ద్రవ్యలోటు జీడీపీలో 4.9 శాతానికి తగ్గుతుందని కేంద్రం అంచనా.. మరింత హేతుబద్ధంగా జీఎస్టీ రేట్లు.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలు మరింత సరళతరం చేస్తామని వెల్లడి..
ఎన్‌పీఎస్ పథకంలో మార్పులు.. మైనర్లూ చేరేందుకు అవకాశం
భూముల పరిరక్షణ కోసం డిజిటల్ భూ- ఆధార్.. స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి.. మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు.. రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీలేని రుణాలు.. రాజ్ గిరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. నలంద యూనివర్సిటీని టూరిస్త్ సెంటర్ గా అభివృద్ధి చేస్తాం..
మౌలిక సదుపాయల కల్పనకు బడ్జెట్‌లో మరోసారి కేంద్రం పెద్దపీట.. బడ్జెట్‌లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయింపు.. జీడీపీలో 3.4 శాతానికి సమానం
బిహార్ లో వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు.. కోసీ నదిపై ప్రాజెక్టులు, నదుల అనుసంధానానికి రూ. 11, 500 కోట్లు.. అసోంలో బ్రహ్మపుత్ర వరదల వల్ల తీవ్ర నష్టం.. అసోంలో ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట.. సిక్కిం, ఉత్తరాఖండ్ లో వరదలు, భారీ వర్షాలతో తీవ్ర నష్టం.. ఈ రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక సాయం.. గయా బుద్ధగయాలో కాశీ తరహా కారిడార్.. ఒడిశాలోన ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరో 3 కోట్ల ఇళ్లు.. పట్టణాల్లో కోటి ఇళ్ల నిర్మాణం.. ప్రధాన మంత్రి సడక్ యోజనకు పెద్దపీట.. 25 వేల గ్రామాలకు కొత్తగా రోడ్లు..
గృహ నిర్మాణంపై బడ్జెట్‌లో ప్రకటన.. అర్బన్ హౌసింగ్ కోసం ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్లు కేటాయింపు
పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ.. 30 లక్షలకు పైగా జనాభా ఉన్న 14 పట్టణాల్లో ప్రత్యేక చర్యలు.. పట్టణాల్లో గృహ నిర్మాణానికి 10 లక్షల కోట్లు.. 100 పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు.. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిబిలీ యోజన.. కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. అణు విద్యుత్ ప్రత్యేక దృష్టి.. కొత్త రియాక్టర్ల ఏర్పాటుకు చర్యలు..
ఎన్డీయేలోని కీలక భాగస్వామ్య రాష్ట్రాలకు కేంద్రం వరాలు.. బిహార్ కు కేంద్రం బంఫర్ బొనాంజ.. న్యూ అమృత్సర్- గయా ఎక్స్ ప్రెస్ వే.. బిహార్ రాష్ట్ర అభివృద్దికి ప్రత్యేక నిధులు.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం.. అవసరాన్ని బట్టి అమరావతి, పోలవరానికి మరిన్ని అదనపు నిధులు..
ఈశాన్య రాష్ట్రాల్లో 100 పోస్టల్ పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు.. ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక ప్యాకేజీలు.. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ స్కీం.. సులభంగా రుణం అందేలా చర్యలు.. ముద్ర రుణాలు రూ. 10 నుంచి 20 లక్షలకు పెంపు.. 100 ఫుడ్ క్యాలిటీ ల్యాబ్స్ ఏర్పాటు.. 12 ఇండ్రస్టీయల్ పార్కుల ఏర్పాటు.. క్రిటికల్ మినరల్ మిషన్ ఏర్పాటు..
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు.. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి..
ఏపీ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సాయం చేస్తాం.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సాయం.. అవసరాన్ని బట్టి అదనపు నిధులు కేటాయిస్తాం.. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు.. వాటర్, పవర్, రైల్వే, రోడ్ల రంగంలో ఏపీకి అండగా నిలుస్తాం..
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణఆనికి ప్రత్యేక సాయం.. బడ్జెట్ లో రూ. 15 వేల కోట్లు ప్రకటించిన కేంద్రం.. విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు.. విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు..
బడ్జెట్ లో బిహార్ కు పెద్దపీట.. బిహార్ కు ఎక్స్ ప్రెస్ వేలు, రహదారులు.. గంగానదిపై మరో రెండు బ్రిడ్జులు.. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణం...
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి పూర్వోదయ పథకం.. బిహార్, ఏపీలోనూ పూర్వోదయ పథకం అమలు..
20 లక్షల మంది యువతకు శిక్షణకు సరికొత్త కార్యక్రమం.. 1000 ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాట్లు..
మూడు స్కీంల ద్వారా ఉద్యోగ కల్పన.. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారిక కోసం పథకం.. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి ఈపీఎఫ్ఓ పథకం.. 2 కోట్ల మంది యువతకు లబ్ధి.. వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏర్పాటు.. మహిళల నైపుణ్య అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు..
ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి.. వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల నూతన వంగడాలు.. వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం.. మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్
కోటి మంది రైతులకు సహజ సేద్యంపై శిక్షణ.. కూరగాయల ఉత్పత్తి, సరఫరాకు ప్రత్యేక చర్యలు.. వ్యవసాయం డిజిటలైజేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమం.. 400 జిల్లాల్లో అమలు.. యువతకు ఐదు ఉద్యోగ పథకాలు.. 4 కోట్ల మందికి స్కిల్ పాలసీ..
ఈ బడ్జెట్ వికసిత్ భారత్ కు రోడ్ మ్యాప్ రూపొందిస్తుంది.. సమ్మిళిత అభివృద్దికి బడ్జెట్ లో పెద్దపీట
ఉద్యోగ కల్పన, నైపుణ్యాల అభివృద్ది, మధ్య తరహా పరిశ్రమలపై ఈ బడ్జెట్ లో దృష్టి పెట్టాం.. నాలుగు కోట్ల యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కృషి
పేదలు, మహిళలు, యువత, రైతులే లక్ష్యంగా పథకాలు.. రైతుల కోసం ఇటీవల అన్ని పంటల మద్దతు ధరల పెంచాం..
ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి చారిత్రాత్మక విజయం సాధించారు.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంతోనే ఈ విజయం లభించింది..
దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు వృద్ధి చెందుతుంది.. ద్రవ్యోల్భణం తగ్గుతుంది..
లోక్ సభలో ప్రారంభమైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం..
వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుపు, మెజెంటా రంగు చీరలో కనిపించారు. ఏటా బడ్జెట్ రోజున ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా నిర్మలా చూసుకుంటారు.
కాసేపట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ప్రస్తుతం నష్టాల బాట పట్టాయి. ఉదయం 10: 48 గంటల సమయంలో సెన్సెక్స్ 86 పాయింట్ల నష్టంతో 80, 415 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 45 పాయింట్లు కుంగి 24, 463 దగ్గర కొనసాగుతోంది.
బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. కాసేపట్లో పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
మరోసారి పేపర్లెస్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ట్యాబ్ లో బడ్జెట్ తీసుకొచ్చిన నిర్మలా..
వరుసగా ఏడోసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్నారు.. వికసితక భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం ముగిసింది. పార్లమెంట్ కు చేరుకున్న ఆర్థిక మంత్రి నిర్మల.. మరికాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం..
కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం.. 2024-25 బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్.. లోక్ సభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
రాష్ట్రపతి ముర్మును కలిసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2024-25 బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు రాష్ట్రపతికి సమాచారమిచ్చిన నిర్మల.. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం.