హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విద్యార్థి నితిన్ గురువారం రాత్రి విధులకు హాజరుకాగా.. శుక్రవారం ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ నితిన్ మృతిపై తల్లిదండ్రలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు అంటూ నిమ్స్ అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచడానికి మీడియాను అన్నివిధాలుగా…
నిమ్స్‌లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది.
నిమ్స్ యూరాలజీ విభాగం రికార్డులను తిరగరాస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది. 1989లో ప్రారంభమైనప్పటి నుంచి మూత్రపిండ మార్పిడి సర్జరీలకు నమ్మకమైన చిరునామాగా నిలిచిన నిమ్స్, భారీ శస్త్రచికిత్సలు, ఆధునిక నైపుణ్యంతో ప్రసిద్ధి చెందింది. 2015లో సీనియర్ ప్రొఫెసర్, విభాగాధిపతి డా. సి. రామ్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత శస్త్రచికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగింది. సీనియర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్‌ల బృందం గత పదేళ్లలో 1000కి పైగా కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసింది. ముఖ్యంగా గత…
నేను సీఎం చంద్రబాబుకి ఏకలవ్య శిష్యురాలిని.. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంప్ కార్యాలయ దగ్గర ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 75వ పుట్టినరోజు సందర్భంగా 75 కిలోల కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేసింది హోం మంత్రి. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలకు అన్నదానం ఏర్పాటు చేసి, భోజనాలు ఒడ్డించారు మంత్రి అనిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాకు దైవ సమానులైన చంద్రబాబు నిండు నూరేళ్లు…
పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి అత్యవసర వైద్య విభాగంలో అగ్ని ప్రమాద ఘటనకు సిగిరెట్టే కారణమని అధికారులు నిర్ధారించారు. సిగరెట్, చెత్తతోనే అగ్ని ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. బీడీ, సిగరెట్ కేర్ లెస్ స్మోక్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు గుర్తించారు. శనివారం సాయంత్రం అత్యవసర వైద్య విభాగంలోని ఐదో అంతస్తు ఆడిటోరియంలో చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కిటికీల నుంచి దట్టమైన పొగ బయటకు రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది…
నిమ్స్‌లో యువకుడికి సక్సెస్ ఫుల్‌గా గుండె మార్పిడి పూర్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతం పేషెంట్ కోలుకుంటున్నారు.. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డాక్టర్లను అభినందించారు.మంత్రి.. డోనర్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అవయవదానంపై అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు.
నిమ్స్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది.. చేయని తప్పుకి ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికున్ని పంజాగుట్ట పోలీసులు చితకబాదారు. ఎమ్మారై స్కానింగ్ కోసం వచ్చిన పేషెంట్ బంగారు గొలుసు పోయిందని కాంట్రాక్టు కార్మికుని కొట్టారు. పేషెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాంట్రాక్టు కార్మికుల్ని గొలుసు గురించి ప్రశ్నించారు.
నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం వింత వ్యవహారం బయటకు వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో హాలిడే అంటూ ప్రకటన వెలువడింది. ఇవ్వాళ ఉదయాన్నే నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ పేరుతో ఓపీ వైద్య సేవలకు సెలవు అని ప్రకటన విడుదలైంది. ఇది ప్రకటించిన కొన్ని గంటలకు మరోసారి ప్రకటన వచ్చింది. నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు యథాతథం అంటూ అందులో పేర్కొన్నారు. దీంతో రోగులతో పాటు, వైద్యులు కూడా గందరగోళానికి గురయ్యారు. ఇటువంటి ప్రకటనల వల్ల…
నిమ్స్‌లో 10 నెలల్లోనే 101 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసి మరో ఘనత నిమ్స్ ఖాతాలో చేరింది. ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా సర్జరీలు చేశారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో డాక్టర్లు, సిబ్బందిని మంత్రి దామోదర రాజనర్సింహా అభినందించారు. 10 నెలల్లోనే వందకుపైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసిన ప్రభుత్వ దవాఖానగా నిమ్స్ హాస్పిటల్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకూ 101 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు…
Free Heart Surgeries: గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు యూకే వైద్యబృందం శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్‌లో ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు యూకే వైద్యబృందం దవాఖానకు రానుందని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.