Free Heart Surgeries: గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు యూకే వైద్యబృందం శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్‌లో ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు యూకే వైద్యబృందం దవాఖానకు రానుందని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. యూకేలో స్థిరపడిన డాక్టర్ రమణ దన్నపనేని ఆధ్వర్యంలో ప్రతి ఏటా వారం రోజుల పాటు నిమ్స్ భాగస్వామ్యంతో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు.
Read also: KTR: హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్.. రెండు వారాల తర్వాత నగరానికి..
ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేయించుకోలేని గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్స అందించనున్నారు. ఈ నెల 22 నుంచి 28 వరకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. తెలంగాణ సర్కార్ సహకారంతో డాక్టర్ రమణ దన్నపనేని నేతృత్వంలోని యూకే వైద్య బృందం ఈ వైద్య సేవలను అందించనుంది. డాక్టర్ రమణ దన్నపనేని బృందం ప్రతి ఏటా నిమ్స్‌లో ఈ ఏడాది కూడా వారం రోజుల పాటు శిబిరాన్ని నిర్వహించనుంది. నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప శుక్రవారం మాట్లాడుతూ గుండెలో రంధ్రం, ఇతర గుండె సమస్యలతో బాధపడే చిన్నారులు ఉచితంగా వైద్యసేవలు పొందవచ్చని తెలిపారు. యూకే బృందంతో పాటు నిమ్స్ కార్డియోథొరాసిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ అమరేశ్వరరావు, సీనియర్ వైద్యులు గోపాల్, ఇతర సిబ్బంది శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు. ఈ ఉచిత వైద్య సేవలను పొందాలనుకునే వారు పంజాగుట్ట నిమ్స్‌లోని కార్డియో థొరాసిక్ వైద్యులను సంప్రదించాలని సూచించారు.
Eating Eggs: వావ్.. మహిళలు గుడ్లు తింటే ఇన్ని లాభాలున్నాయా?