నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం వింత వ్యవహారం బయటకు వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో హాలిడే అంటూ ప్రకటన వెలువడింది. ఇవ్వాళ ఉదయాన్నే నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ పేరుతో ఓపీ వైద్య సేవలకు సెలవు అని ప్రకటన విడుదలైంది. ఇది ప్రకటించిన కొన్ని గంటలకు మరోసారి ప్రకటన వచ్చింది. నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు యథాతథం అంటూ అందులో పేర్కొన్నారు. దీంతో రోగులతో పాటు, వైద్యులు కూడా గందరగోళానికి గురయ్యారు. ఇటువంటి ప్రకటనల వల్ల అనేకమంది రోగులు ఇబ్బందులు పడ్డారు.
READ MORE: Srinivasa Rao: ప్రభుత్వం మారి 6 నెలలు గడిచినా.. విధానాలు మాత్రం మారలేదు..!
ఇదిలా ఉండగా.. భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ రోజు (డిసెంబర్ 27) సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి వెల్లడించారు.
READ MORE: Fact Check: ఆసుపత్రిలో మన్మోహన్ సింగ్ చివరి ఫొటో వైరల్..