యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియను కాపాడాలనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. నిమిష హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పిస్తున్న యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీ కుటుంబం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారతీయ నర్సు నిమిషను వీలైనంత త్వరగా ఉరితీయాలని వారు యెమెన్‌లోని హౌతీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో, కేరళ నివాసి అయిన నిమిషను జూలై 16న ఉరితీయాల్సి ఉంది. కానీ అది నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు బాధితుడి కుటుంబం నిమిషను…
Nimisha Priya Case: యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటుున్న కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా కేసులో కేంద్రం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. మరణశిక్ష రద్దు నివేదికల్ని భారత్ తిరస్కరించింది. ఈ కేసుపై భారత్, యెమెన్‌తో కలిసి పనిచేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) తెలిపింది.
ఇవాళ కొన్ని గంటల క్రితం కేరళ నర్సు నిమిషా ప్రియకు యెమెన్ లో ఉరిశిక్ష రద్దు అంటూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. భారతీయ నర్సు నిమిషా ప్రియకు విధించిన మరణశిక్షను పూర్తిగా రద్దు చేసినట్లు గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా కాంతపురం ఎపి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, యెమెన్ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక లిఖిత పూర్వక ధృవీకరణ రాలేదని కూడా ప్రకటనలో స్పష్టం చేశారు. తాజాగా ఈ…
నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా నరాలు తెగే ఉత్కంఠ. పరాయి దేశంలో భారతీయ నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్ష రద్దవుతుందా లేదా? అని.. రద్దు అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. మొత్తానికి ప్రభుత్వ కృషి, ప్రజల ప్రార్థనలతో నిమిషా ప్రియకు మరణ శిక్ష తప్పింది. యెమెన్‌లో భారతీయ నర్సు నిమిషా ప్రియకు విధించిన మరణశిక్షను పూర్తిగా రద్దు చేశారు. దీనికి సంబంధించి గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా కాంతపురం ఎపి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఒక ప్రకటన…