తెలంగాణ బాక్సర్, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎట్టకేలకు తన కల నెరవేర్చుకుంది. తనకు ఇష్టమైన బాలీవుడ్ హీరో సల్మాన్‌తో కలిసి ఓ సూపర్ హిట్ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది.
Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో రేపు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 8వ తేదీ వరకు (అంటే 12 రోజుల పాటు) జరగనున్నాయి. ఈ పోటీల్లోని 6 ఈవెంట్లలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 మంది ప్రముఖ క్రీడాకారులు పాల్గొంటున్నారు.
ఆరుసార్లు వరల్డ్ చాంపియన్, కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా రెండో పసిడి సాధించాలనే భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఆశలు ఆవిరయ్యాయి. బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ క్రీడల కోసం భారత బాక్సింగ్ జట్టును ఎంపిక చేసేందుకు ఇందిరా గాంధీ స్టేడియంలో ట్రయల్స్ జరుగుతున్నాయి. మహిళల 48 కేజీల విభాగంలో ఎంసీ మేరీకోమ్ పోటీపడింది. శుక్రవారం జరిగిన ట్రయల్స్ తొలి రౌండ్‌లో కాలు గాయానికి గురైన మేరీకోమ్.. బౌట్ మధ్యలోనే నిష్క్రమించింది. 2018 కామన్‌వెల్త్ క్రీడల పసిడి విజేత, 39 ఏండ్ల…
భాగ్యనగరంలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందన్నారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని అనేకసార్లు ప్రధానిని అడిగినా ఫలితం లేదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయ పరమైన నిధులపై కేంద్రం కోత విధించిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దారుణంగా విఫలం అయిందన్నారు.…
వరల్డ్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలచిన నిఖత్ జరీన్ ఈ రోజు ప్రధాని మోదీని కలిసింది. గత నెలలో టర్కీలో జరిగిన పోటీలో ఫైనల్స్ లో థాయ్ లాండ్ కు చెందిన జిట్పాంగ్ జుతామస్ ను మట్టికరిపించి, బంగారు పథకం గెలిచి వరల్డ్ ఛాంపియన్ గా గెలిచిన జరీన్ దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసింది. అయితే నిఖత్ జరీన్ తో పాటు మానిషా మౌన్, ప్రవీన్ హుడాలు కూడా ప్రధానిని కలిశారు. ప్రధానితో కాసేపు…
అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో బంగారు పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్, ISSF షూటింగ్ పోటీల్లో స్వర్ణ పతకం గెలుచుకున్న ఇషా సింగ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్ల నగదు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాకుండా ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్‌లో ఇంటి స్థలం కేటాయిస్తామని తెలిపింది. కాగా ఇటీవల టర్కీ…
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం తరుఫున ఘన స్వాగతం పలికారు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిఖత్ జరీన్‌కు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఆణిముత్యాలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో ఈ ఘనత సాధించిందని…
ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం సాధించి అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్. అయితే నేడు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరుపున క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికారు. అయితే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నాకు ఇంతటి…
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ ఇవాళ హదరాబాద్ రానున్నారు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నది. దీంతో తెలంగాణ ఆణిముత్యానికి ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందూరు బిడ్డకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలుకనున్నారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో నిఖత్ జరిన్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్స్‌లో 52 కేజీల విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్…