ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో నైట్ కర్ఫ్యూ విధించాలని సోమవారం సీఎం జగన్ ఆదేశించగా… అందుకు సంబంధించిన జీవోను మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా విడుదలైన జీవో ప్రకారం ఏపీలో ఈనెల 31 వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉ.5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అలాగే కరోనా ఆంక్షలు కూడా రాష్ట్రంలో అమలులో ఉంటాయని తెలిపింది.…
ఏపీలో ఇవాల్టి నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. అలాగే 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడుస్తాయి. మాల్స్, దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు తప్పని సరిగా పాటించాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలన్న సీఎం జగన్.. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు.మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను…
మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.. దీంతో కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా రాష్ట్రాలు, నైట్ కర్ఫ్యూలు, సంపూర్ణ లాక్‌డౌన్‌లు.. ప్రజలు ఎక్కువగా కలుసుకునే అవకాశం ఉన్న విందు, వినోదాలపై ఆంక్షలు.. ఇలా పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు.. తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది.. ఆదివారం అంటే ఇవాళ ఒక్కరోజు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.. అత్యవసర సేవలు మినహా వేటికీ అనుమతి లేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.. అయితే, ఇవాళ ఒకేరోజుకు…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు కూడా టెన్షన్ పెడుతున్నాయి.. తగ్గినట్టే తగ్గిన కోవిడ్ మళ్లీ పంజా విసురుతుండగా.. మరోవైపు.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో.. దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలు బాటపడుతున్నాయి.. కోవిడ్ నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.. ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం…
దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలయిందా ? పెరుగుతున్న కేసులతో జాగ్రత్తలు తీసుకోకపోతే…భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనా ? ప్రధాన నగరాల్లో వెలుగుచూస్తున్న ఒమిక్రాన్ కేసులే…ఇందుకు కారణమా ? కేసులు పెరగకుండా…ప్రభుత్వాలు జాగ్రత్తలు పడుతున్నాయా ? కఠిన ఆంక్షల దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయా ? నిన్న మొన్నటివరకూ 10 వేల లోపే వున్న కరోనా కేసులు 50 వేలు దాటాయి. రానురాను ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌లో కరోనా, ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మెట్రో…
యూపీలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. జనవరి 6 వ తేదీ నుంచి జనవరి 14 వరకు సెలవులు ప్రకటించింది. యూపీలో యాక్టీవ్ కేసులు 3 వేలు దాటటంతో ఈ నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా నైట్ కర్ఫ్యూ సమయాన్ని కూడా ప్రభుత్వం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉన్న కర్ఫ్యూను మరో రెండు గంటలు పొడిగించింది. రాట్రి 10…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారు వీరు అనే తేడా లేకుండా కరోనా బారిన పడుతున్నారు. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాపిస్తోంది. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాప్తి చెందింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ రోజు పంజాబ్ పటియాల మెడికల్ కాలేజీలో 100 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకడంతో ఆ రాష్ట్రం అప్రమత్తమయ్యి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి…
2019లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి 2022లోకి అడుగు పెట్టినా వదలడం లేదు.. ఇక, కొత్త కొత్త వేరియంట్లుగా ప్రజలపై ఎటాక్ చేస్తూనే ఉంది.. తాజాగా సౌతాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలకు పాకిపోయిన సంగతి తెలిసిందే.. ఒమిక్రాన్ కేసులతో పాటు.. కోవిడ్ కేసులు కూడా చాలా దేశాల్లో పెరుగుతూ టెన్షన్ పెడుతున్నాయి.. కానీ, ఒమిక్రాన్ మొదట వెలుగుచూసిన దక్షిణాఫ్రికా పరిస్థితి వేరుగా ఉంది.. ప్రభుత్వం అక్కడ కొన్ని ఆంక్షలను ఎత్తివేసింది.. కరోనా…
దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతున్నది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలపై అనేక రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించాయి. తాజాగా కేరళ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలు…
ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఢిల్లీలో కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఇవాళ ఢిల్లీలో 290 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 16శాతం పెరిగింది. మరోవైపు పాజిటివిటీ రేటు ఐదు శాతానికి మించడంతో… ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. దీంతో ఢిల్లీలో న్యూఇయర్ వేడుకలకు ఫుల్‌స్టాప్ పడింది.