2019లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి 2022లోకి అడుగు పెట్టినా వదలడం లేదు.. ఇక, కొత్త కొత్త వేరియంట్లుగా ప్రజలపై ఎటాక్ చేస్తూనే ఉంది.. తాజాగా సౌతాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలకు పాకిపోయిన సంగతి తెలిసిందే.. ఒమిక్రాన్ కేసులతో పాటు.. కోవిడ్ కేసులు కూడా చాలా దేశాల్లో పెరుగుతూ టెన్షన్ పెడుతున్నాయి.. కానీ, ఒమిక్రాన్ మొదట వెలుగుచూసిన దక్షిణాఫ్రికా పరిస్థితి వేరుగా ఉంది.. ప్రభుత్వం అక్కడ కొన్ని ఆంక్షలను ఎత్తివేసింది.. కరోనా కట్టడి కోసం దాదాపు రెండేళ్లుగా అమలు చేస్తోన్న నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
Read Also: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా..? అదనపు వడ్డింపు షురూ..
నైట్ కర్ఫ్యూ ఎత్తివేయడంతో పాటు.. మరికొన్ని వెసులుబాట్లు కల్పించింది దక్షిణాఫ్రికా ప్రభుత్వం.. ఇప్పటి వరకు సభలు, సమావేశాల్లో పాల్గొనేవారిపై ఉన్న పరిమితులపై కూడా కాస్త సడలింపులు ఇచ్చింది.. ఇక, కరోనా నాలుగో వేవ్ తీవ్రత నుంచి బయటపడినట్టు ప్రకటించింది.. అయితే, ఇదే సమయంలో.. ఒమిక్రాన్ తో మళ్లీ కోవిడ్ కేసులు పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరించింది సౌతాఫ్రికా.. మొత్తంగా.. సౌతాఫ్రికా ఆంక్షలు ఎత్తివేస్తుంటే.. చాలా దేశాలు.. ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో ఆంక్షల బాట పడుతోన్న సంగతి తెలిసిందే.