కేరళ రాష్ట్రంలో 66వ జాతీయ రహదారి (NH-66) మరోసారి కుంగిపోవడం స్థానికుల్లో తీవ్ర ఆందోళన రేపింది. ఇటీవలే నిర్మించిన ఈ రహదారిపై ఒక్కసారిగా పగుళ్లు ఏర్పడి, రోడ్ మధ్య భాగం కుంగిపోవడంతో నాలుగు వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వివరాల్లోకి వెళ్తే—కేరళలోని కొట్టయంపై–మైలక్కడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తగా నిర్మించినప్పటికీ రోడ్ ఇంత వేగంగా ధ్వంసం కావడంతో స్థానికులు కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలి కాలంలో ఇదే హైవేపై ఇలాంటి ఘటన…