ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) రూ.120 కోట్ల జరిమాన విధించింది. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని ఎన్‌జీటీ ఈ జరిమానా విధించింది. మొత్తం రూ. 120 కోట్లను కట్టాలని ఎన్‌జీటీ పేర్కొంది. కాగా ఇ్పపటికే ఈ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వేగవంతంగా పనులను చేపడుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే అటు ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాలలకు తాగునీటి కష్టాలు తీరుతాయి.…
కేసీఆర్ అసమర్థతతోనే ప్రాజెక్టులన్ని సమాధి అవుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయనా మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై NGT స్టే ఇచ్చిందని, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడానికి చూశారు .. ఇప్పుడు పనులు మధ్యంతరంగా ఆగిపోయాయన్నారు. కేసీఆర్‌కు కొందరు కాంట్రాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు, ప్రాజెక్ట్ రీ డిజైనింగ్ చేశారు. మూడేళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఆరేళ్లయినా పూర్తి కాలేదన్నారు. ప్రభుత్వం అసమర్థత…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బ్రేక్ వేసింది.. ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది… పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది.. కాగా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద నిర్మిస్తున్నారు. దీనికి 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది…
రాయలసీమ ఎత్తిపోతల కేసులో మరోసారి విచారణ జరిపింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ).. ఇవాళ విచారణ సందర్భంగా.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎన్జీటీకి నివేదిక అందజేసింది.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన శాస్త్రవేత్త పసుపులేటి డా. సురేష్ బాబు.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలం వద్ద ఎలాంటి పనులు జరగడం లేదని.. ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకువచ్చిన సామగ్రి అంతా ఆ ప్రాంతంలో నిల్వ ఉంచారని ఎన్జీటీ…
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వ్యవహారం ఏపీ, తెలంగాణ మధ్య కాకరేపాయి.. పరస్పరం ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు.. ఇలా చాలా వరకే వెళ్లింది వ్యవహారం.. అయితే, విషయంలో కృష్ణా నది యాజమాన్యబోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), చెన్నై బెంచ్.. సొంతంగా తనిఖీలు జరిపి నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తనిఖీలకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదన్న కృష్ణా బోర్డు నివేదనను పరిగణలోకి…
రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ సర్కార్ ధిక్కరణ పిటిషన్ వేసింది. ఈ ధిక్కరణ పిటిషన్‌ను ఎన్జీటీలో ప్రస్తావించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ తరఫున ప్రస్తావించారు ఏఏజీ రామచందర్‌రావు. గతంలో ధిక్కరణ పిటిషన్ వేసిన గవినోళ్ల శ్రీనివాస్… ఎన్జీటీలో నేడు విచారణకు రాలేదు. దీంతో ధిక్కరణ పిటిషన్ వేశామని ఎన్జీటీకి తెలిపారు తెలంగాణ ఏఏజీ రామచందర్‌రావు. నేడు నివేదిక సమర్పించాల్సి ఉన్న కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణశాఖ రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించిన నివేదికను ఎన్జీటీ ఇవ్వాలని పేర్కొంది. read also :…
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటి తీర్పు విరుద్ధంగా పనులు చేపట్టినట్లు తేలితే చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామంటూ హెచ్చరికలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పనులు చేస్తున్నారని, తెలంగాణ సర్పంచ్ ల సంఘం నేత గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ ను…