గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రపంచంలోని 70 శాతం మంది జనాభా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ప్రపంచం మెల్లిగా బయటపడుతున్నది. కొన్ని దేశాల్లో మినహా చాలా చోట్ల కరోనా కంట్రోల్‌లోకి వచ్చింది. అత్యధిక జనాభా కలిగిన ఇండియాలో సైతం కరోనా కంట్రోల్‌లోకి వచ్చింది. వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడమే ఇందుకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. కరోనా కంట్రోల్‌లోకి రావడంతో ఇప్పటి వరకు ఇళ్లకే పరిమితమైన ప్రజలు క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను పెద్ద ఎత్తున జరుపుకోవడానికి పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.
Read: ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన: ఢిల్లీ నుంచి అయోధ్యకు ఫ్రీ ప్రయాణం…
ఇప్పటికే రైళ్లలో బుకింగ్‌లు పూర్తయ్యాయి. రిజర్వేషన్‌లు పూర్తికావడంతో ప్రత్యామ్నాయంగా విమానాలను ఆశ్రయిస్తున్నారు. కాగా, నవంబర్ 15 వ తేదీ నుంచి దేశీయ విమానాల టికెట్లు సైతం భారీగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ నుంచి కొత్త సంవత్సరం వరకు రెండు నెలల ముందే వివిధ ఎయిర్‌లైన్స్‌లో టికెట్లను బుక్ చేసుకున్నారు. ఎయిర్ టికెట్ తో పాటుగా అటు హోటల్ రూమ్స్ ధరలు కూడా పెరిగినట్టు ఈజీమై ట్రిప్ సంస్థ తెలియజేసింది. కరోనా తరువాత హోటల్ రంగం తిరిగి పుంజుకుందని, టూరిజం రంగం నిబంధనలు సడలించడంతో హోటల్స్ కళకళలాడుతున్నాయని ఈజీమైట్రిప్ తెలియజేసింది. ఢిల్లీ-గోవా, ముంబై-గోవా రూట్ లో డిమాండ్ పెరగడంతో విమాన ఛార్జీలు 30 శాతం మేర పెరిగినట్టు ఎయిర్‌లైన్స్ అధికారులు చెబుతున్నారు.