కరోనా మహమ్మారి రోజురోజు కొత్తగా రూపాంతరాలు చెందుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది. గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు, దాని నివారణకై శాస్త్రవేత్తలు ఇప్పటికే తలలు బద్దలు కొట్టుకుంటుంటే ఇప్పుడు మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రానికి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు ఆరోగ్య అధికారులు బుధవారం…