ఈరోజు సాయంత్రం న్యూషెపర్డ్ వ్యోమనౌక రోదసిలోకి ప్రయాణం చేయబోతున్నది. రోదసిలోకి ప్రయాణం చేయబోతున్న ఈ నౌకను తిరిగి వినియోగించేందుకు అనువుగా తయారు చేశారు. పశ్చిమ టెక్సాస్‌లోని ఎడారి నుంచి వ్యోమనౌక రోదసిలోకి ప్రయాణం చేస్తుంది. నిట్టనిలువుగా పైకి దూసుకెళ్లే ఈ నౌక భారరహిత స్థితికి చేరుకున్నాక, నౌన నుంచి బూస్టర్ విడిపోతుంది. విడిపోయి తరువాత బూస్టర్ తిరిగి నేలకు చేరుకుంటుంది. వ్యోమనౌక అక్కడి నుంచి మరింత ఎత్తుకు చేరుకుంటుంది. కర్మన్ రేఖను దాటి పైకి వెళ్లిన కాసేటి…
అంతరిక్ష యాత్రకు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సిద్ధం అవుతున్నారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు జెఫ్ బెజోస్ ఆయన తమ్ముడు, మరో నలుగురితో కలిసి అంతరిక్షయానం చేయబోతున్నారు. తన అంతరిక్ష సంస్థ బ్లూఆరిజిన్ తయారు చేసిన న్యూషెపర్డ్ స్పేస్ షటిల్ ద్వారా ఈ బృందం అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు. భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి కర్మన్ రేఖను దాటి అక్కడి నుంచి తిరిగి భూమికి చేరుకుంటారు. ఈ న్యూషెపర్డ్ లో…