Lok Sabha First Session Live: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి సమావేశంలో కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని తర్వాత జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుండగా, జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. బిజెపి నాయకుడు ఏడుసార్లు ఎంపి భర్తృహరి మహతాబ్‌ను లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా నియమించడం వల్ల సెషన్‌లో లోక్‌సభలో సందడి…
PM Modi: ఆటల నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మహిళా బిల్లు చాలా రోజులుగా పెండింగ్ ఉందని, నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు వచ్చిందన్నారు.
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంలో సభ కొలువుదీరింది. మోడీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనంలోకి ఎంపీలంతా ఎంట్రీ ఇచ్చారు. ప్రధాని మోడీ కేంద్రమంతులు పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషిలతో పార్లమెంట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీతో పాటు కాంగ్రెస్, ఇతర విపక్షాల ఎంపీలు కొత్త పార్లమెంట్ భవనంలో సభకు హాజరయ్యారు.
Old Parliament: దశాబ్ధాల చరిత్ర కలిగిన పార్లమెంట్ భవనం నేటితో రిటైర్ కాబోతోంది. ఎన్నో రాజకీయాలకు సాక్ష్యంగా మిగిలిన పాత పార్లమెంట్ భవనంలో ఇకపై అధ్యక్ష అనే మాటలు వినిపించవు. ఈ రోజు కొత్త పార్లమెంట్ భవనంలోకి సభ మారబోతోంది.
Parliament special session: వందేళ్ల నాటి కట్టడం, భారతదేశ భవిష్యత్తు, అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి చిరునామా నిలిచిన పార్లమెంట్, నేడు కొత్త భవనంలోకి తరలివెళ్తోంది. ఎన్నోచర్చలు, భావోద్వేగాలు, ఉగ్రవాద దాడికి కూడా ఈ బ్రిటీష్ హయాంలోని కట్టడం సాక్ష్యంగా నిలిచింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మోడీ సర్కార్ కొత్త పార్లమెంట్‌ని నిర్మించింది. తాజాగా ఈ రోజు నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి సభ మారనుంది. ఇప్పటి నుంచి కొత్త పార్లమెంట్ దేశ భవిష్యత్తుకు కొత్త చిరునామా కానుంది.
Parliament Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఆదివారం నూతన భవనంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
పార్లమెంట్ సంబంధిత వ్యవహారాలపై చర్చ చాలా ముఖ్యమని, కానీ రాను రాను ఈ సంప్రదాయం క్షీణిస్తోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. నూతన పార్లమెంటు భవనం గురించి రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందని ఆయన అన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు జూన్ 12న పాట్నాలో సమావేశం కానున్నాయి. 18కి పైగా భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలు ఈ సదస్సుకు హాజరు కానున్నాయి.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ మల్లయోధులు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతలకు దారితీసింది. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మల్లయోధులు, వివిధ రాష్ట్రాల ఖాప్ పంచాయతీలు, రైతులు ఆదివారం పార్లమెంటు భవనం సమీపంలో 'మహిళా సమ్మన్ మహాపంచాయత్'కు పిలుపునిచ్చారు.