Uttam Kumar Reddy : తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆశావహుల జాబితాను కాంగ్రెస్ హైకమాండ్‌కు పంపినట్లు సమాచారం. హైకమాండ్ పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రత్యేకంగా కలుసుకుని మంత్రివర్గ విస్తరణపై అధికారికంగా సమాచారం అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 3వ తేదీన నలుగురు కొత్త మంత్రులు కేబినెట్‌లో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఇక,…
డిసెంబర్ 9న మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. విశ్వాస పరీక్ష అనంతరం ప్రస్తుతం అందరి దృష్టి మహాయుతి కూటమి మంత్రివర్గ విస్తరణపై ఎక్కువగా ఉంది. డిసెంబరు 16న ప్రారంభమయ్యే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు డిసెంబర్ 14న విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ-జనసేన కూటమి సంచలనం సృష్టించింది. ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. టీడీపీ 144కు గానూ 135, జనసేన 21కి 21, బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది.
రెండున్నరేళ్ళ తర్వాత కేబినెట్ మారుస్తానని చెప్సిన జగన్ గ్రేస్ పీరియడ్ పెంచి మరో ఆరునెలల తర్వాత కేబినెట్ మార్చారు. అందులోనూ సగం మందిని వుంచేశారు. ఏపీలో కేబినెట్ కూర్పు పూర్తైంది.. శాఖల కేటాయింపు కంప్లీట్ అయింది. చాలా మంది మంత్రులు తమకు అప్పగించిన శాఖలకు సంబంధించి బాధ్యతలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు జరుగుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. తమకు అప్పగించిన శాఖలు నచ్చక..…
వైసీపీ నేతలు అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బహిరంగ సభ ప్రారంభం అయింది. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రారంభమైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆత్మీయ సభకు భారీ స్ధాయిలోవైసీపీ నేతలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. నేను ఎవరికి పోటీ కాను…నాకు నేనే పోటీ అన్నారు అనిల్. ఎవరికీ బల నిరూపణ చేయాల్సిన అవసరం లేదు. జగన్ అన్న…
ఏపీ కేబినెట్ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ నేతలు కేబినెట్ పై మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి సజ్జల, వైవీ, విజయసాయి రెడ్డిలకు పంచాక బీసీలకు ఎన్ని మంత్రి పదవులిస్తే ఏం లాభం..? అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అధికారం తమ చేతుల్లో పెట్టుకుని బీసీ మంత్రులను కీలు బొమ్మల్లా ఆడిస్తున్నారు. బీసీలను పావులుగా వాడుకునే వైసీపీకు, సముచిత న్యాయం కల్పించిన టీడీపీ నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది.…
రాజ్యాధికారంలో చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఆయావర్గాలకు పెద్దపీట వేశామన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పాత కొత్తమేలు కలయికతో కేబినెట్ రూపొందించారన్నారు సజ్జల. వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెటే సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు. ఇప్పుడు పునర్‌వ్యవస్థీకరణ ద్వారా మరో సామాజిక మహావిప్లవం రాబోతోందన్నారు. చరిత్రలో ఎప్పుడూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అగ్రస్థానం. 2019 జూన్ మొదటి కేబినెట్లో 25 మందికిగానూ 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ,…
బీసీలను ఓటుబ్యాంకుగా భావించే పార్టీలకు భిన్నంగా 2019లో సీఎం జగన్ బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చి కొత్త సంప్రదాయం నెలకొల్పారు. పేదలకు తాయిలాలు ఇవ్వడమే కాకుండా సీఎం జగన్ పాలనలో భాగం ఇచ్చారన్నారు సజ్జల. వైసీపీ మొదటి నుంచి బీసీ, ఎస్సీ, ఎప్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేస్తోంది. తొలి కేబినెట్లో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటిచ్చారు. బీసీల్లో ఆత్మస్థయిర్యం పెంచాం. ఈసారి 25మందిలో 70 శాతం మంది బడుగు, బలహీనవర్గాల వారే.…
ఏపీలో కొత్త కేబినెట్ కూర్పు కొలిక్కి వచ్చినట్టే అని భావిస్తున్నారు. అయితే మంత్రి పదవిని ఆశించినవారు తీవ్ర నిరాశకు, అసంతృప్తికి గురవుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ఱారెడ్డి వెళ్లారు. ఆయనతో కలిసి మాట్లాడారు. పదవులు రానివారికి బుజ్జగింపుల పర్వం మొదలయ్యిందని అంటున్నారు. బాలినేని నివాసంలో ఎక్కడా సందడి కనిపించడంలేదు. పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు బాలినేని నివాసం దగ్గరకు చేరుకుంటున్నారు. కొంత మంది కార్యకర్తలు గేటు బయటే పడిగాపులు పడుతున్నారు.…