ఏపీ మంత్రివర్గం కూర్పుపై సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఆదివారం కూడా కొనసాగనుంది. రేపు మరోసారి సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల. మధ్యాహ్నం 12 గంటలకు వీరిద్దరూ భేటీ కానున్నారు. ఇవాళే తుది జాబితా సిద్ధం చేసే దిశగా కసరత్తు ప్రారంభం అయినా ఇంకా కొలిక్కిరాలేదని తెలుస్తోంది. సీఎం, సజ్జల వరుస భేటీల పై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.…
ఏపీలో మంత్రులందరూ రాజీనామాలు చేశారు. దీంతో ఈనెల 11న కొత్త కేబినెట్ కొలువుదీరనుంది. ఈనెల 10న కొత్త మంత్రుల పేర్లను సీఎం జగన్ గవర్నర్ దగ్గరకు పంపించే అవకాశాలున్నాయి. అయితే కొత్త మంత్రివర్గంలో చేరబోయేది ఎవరు అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జిల్లాల వారీగా ఆశావాహులు తమకే మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారో మనం ఓ లుక్కేద్దాం. ★ శ్రీకాకుళం జిల్లా ఔట్: ధర్మాన కృష్ణదాస్, సిదిరి అప్పలరాజు ఆశావహులు:…
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో ఈ రోజు కీలక ఘట్టం జరగబోతోంది. మంత్రి మండలి రద్దు కానుంది.. సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో చివరి క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశం ప్రస్తుతం ఉన్న మంత్రులకు చివరిది అవుతుంది. కొత్తపేటకు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వంటి పలు కీలక అంశాలపై క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది. సమావేశం అనంతరం మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పిస్తారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులకు సంకేతాలు అందటంతో…
ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఈ మధ్య చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది.. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ మధ్యే జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇక కేబినెట్‌లో మార్పులు, చేర్పులు ఉంటాయనేది మరింత స్పష్టం అయ్యింది.. వైఎస్ జగన్ అధికాంరలోకి వచ్చాక తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత.. ఐదేళ్లు పదవులు ఉండబోవని.. మధ్యలోనే మార్పులు చేర్పులు ఉంటాయని కూడా చెప్పారు.. అయితే, ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై హైకమాండ్…