Earthquake: అమెరికాలో భూకంపం సంభవించింది. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలు భూకంపానికి ప్రభావితమయ్యాయి. న్యూజెర్సీలో శుక్రవారం 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఇదొక శుభవార్త. ఆర్సీబీ (RCB) కొత్త జెర్సీ లీక్ అయింది. ఈ జెర్సీని ఆర్సీబీ రివీల్ చేయాల్సి ఉండగా.. జెర్సీ లీక్ అయిపోయింది. ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కొత్త జెర్సీలో కనిపిస్తున్నారు. కోహ్లీ తన జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోవైపు కోహ్లి, సిరాజ్‌లు కొత్త జెర్సీ ధరించిన ఫొటో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే, కొత్త ప్లేయర్స్ తో బలంగా ఉంది. ఇప్పటికే ఐడెన్ మార్క్రమ్ ను కెప్టెన్ గా తొలగించి, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. జట్టులోనూ భారీగా మార్పులు చేపట్టింది. మరోవైపు.. ఈరోజు కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది.
USA: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. 23 ఏళ్ల భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్ అనే వ్యక్తి తాత, అమ్మమ్మ, మామలను హత్య చేశాడు. దిలీప్ కుమార్ బ్రహ్మభట్(72), బింధు బ్రహ్మభట్(72), యష్ కుమార్ బ్రహ్మభట్(38)లను కాల్చి చంపాడని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ పోలీస్ విభాగం, మిడిల్ సెకస్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. సోమవారం ఉదయం 9 గంటలకు సౌత్ ప్లెయిన్ ఫీల్డ్‌లోని న్యూ డర్హామ్ రోడ్‌లోని ఇంటిలో నుంచి కాల్పులు శబ్ధం విన్నట్టు ఇరుగుపొరుగు వారు…
USA: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన కుటుంబంలో విషాదం నిండింది. దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు శవమై కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తేజ్ ప్రతాప్ సింగ్(43), సోనాల్ పరిహార్(42)తోపాటు వారి 10,6 ఏళ్ల వయసున్న పిల్లలు ప్లెయిన్స్‌బోరో లోని వారి ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు.
తాజాగా హిట్‌మ్యాన్ వెయిట్‌లాస్ కావడంతో అతను గత ఫామ్‌ను అందుకుంటాడనే నమ్మకం వస్తుంది. రోహిత్ బరువు తగ్గేందుకు చాలా కష్టపడ్డట్లు తెలుస్తుంది. కఠినమైన డైట్, వ్యాయామాలు చేస్తే తప్పిస్తే అంత ఔట్‌పుట్ రాదు. రోహిత్‌ను ఇప్పుడు చూసిన వారెవరైనా.. ఏంటీ మరీ ఇంత సన్నబడ్డాడని అతని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ప్రయాణాలు చేయాలంటే చాలా మందికి సరదాగా ఉంటుంది. మరికొందరికి ఇష్టంగా ఉంటుంది. ఇంకొందరికి కష్టంగా ఉంటుంది. మరికొందరికీ భయంగా ఉంటుంది. ప్రయాణాలంటే ప్రజలు ఇన్నీ రకాలుగా స్పందిస్తారు. అయితే సాధారణంగా ఎక్కువ మందికి ప్రయాణాలు చేయాలంటే సరదా.. సంతోషంగా ఉంటుంది.
అమెరికాలో కరోనా కేసులు తగ్గినట్టుగానే తగ్గి తిరిగి భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ప్రతిరోజూ ఆ దేశంలో లక్ష వరకు కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఒకవైపు కరోనా కేసులతో అతలాకుతలం అవుతుంటే, ఇప్పుడు భారీ వర్షాలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. హరికేన్ ఇదా దెబ్బకు దేశం విలవిలలాడిపోతున్నది. న్యూయార్క్‌లో ఎప్పడూ లేని విధంగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ప్రమాదకరమైన స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. రోడ్లన్ని సెలయేరులా మారిపోవడంతో ఎమర్జెన్నీని విధించారు.…