కాళ్లపారాణి ఆరనేలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయనేలేదు. అప్పగింతలు కూడా పూర్తయ్యాయో లేదో.. అప్పుడే ఆ నవ వధువు కలలు కల్లలయ్యాయి. ఏడు అడుగులు వేసి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను దురదృష్టం వెంటాడింది. పెళ్లైన ఐదు రోజులకే వరుడు అకస్మాత్తుగా చనిపోయాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలోచోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా వి. కోట పట్టణలో పెళ్లయిన 5 రోజులకే నవ వరుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.