టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్‌లో విజయం ఉత్సాహాన్నిస్తుంటే.. రెట్టించిన ఉత్సాహంతో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది టీమిండియా. కూన జట్టు నెదర్లాండ్స్‌తో నేడు భారత్ తలపడనుంది.
ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి. ఇప్పటికే అనేక దేశాలు దీని వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా పుణ్యమా పనిచేసే విధానంలో చాలా మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ లో చాలా వరకు ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇప్పటికీ చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఈ పద్ధతి ద్వారానే వారి ఉద్యోగులతో పని చేయించుకుంటున్నాయి. వర్క్ ఫ్రం హోం సంస్కృతికి అలవాటు పడిన వారు ఆఫీసులకు వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు.…
సాధారణంగా దిండు ధర ఎంత ఉంటుంది.. మహా అయితే వందల్లో ఉంటుంది. మరీ అయితే కొన్ని వేలల్లోనే ఉంటుంది. పడుకునే టైమ్ లో తలకింద పెట్టుకునే దిండు ధర రూ. 45 లక్షలు ఉంటుందని ఎవరైనా కలలోనైనా ఊహించి ఉంటారా..? లేదు కదా. కానీ నెదర్లాండ్ లోని ఓ సంస్థ తయారు చేసిన దిండు ధర ఏకంగా 57,000 డాలర్లు, మన కరెన్సీలో రూ. 45 లక్షలు. అయితే మరీ అంతగా ఆ దిండులో ఏముందో తెలుసుకుందాం.…
ఉత్సాహం ఉండాలి, కానీ అత్యుత్సాహం ఉండకూడదు. ఏం కాదులే అని ఆ అత్యుత్సాహాన్ని ఎక్కడిపడితే అక్కడ ప్రదర్శిస్తే మాత్రం.. బాక్స్ బద్దలవ్వడం ఖాయం! ఇప్పుడు నెదర్లాండ్స్ రాయబారి కారెల్ వాన్ ఓస్టెరోయ్ విషయంలోనూ అదే జరిగింది. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో భారతదేశానికి సలహా ఇవ్వబోయి, గట్టి ఎదురుదెబ్బని ఎదుర్కొన్నాయన! దీంతో, మరో దారి లేక ఆయన వెంటనే వెనకడుగు వేయాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, సాధారణ…
వయస్సు పైబడినా.. వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తలేకపోతున్నా.. విమర్శలు ఎదురైనా.. జట్టులోనే ఉండాలి.. క్రికెట్ ఆడుతూనే ఉండాలని భావించే క్రికెటర్లు ఎందరో ఉన్నారు.. ఫిట్‌నిస్ కోల్పోయి.. జట్టుకు దూరమైనా.. మళ్లీ వారి ప్రయత్నాలు సాగిస్తూ వస్తుంటారు.. అయితే, ఓ స్టార్ క్రికెట్ దానికి విరుద్ధం.. 29 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.. అతడే నెదర్లాండ్స్ స్టార్ క్రికెటర్ బెన్ కూపర్.. ఇవాళ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేశాడు. Read Also: సర్కార్ సంచలన నిర్ణయం..!…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో.. నివారణ చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా దేశాలు.. ఇప్పటికే చాలా దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. కేసుల తీవ్రత పెరుగుతుండడంతో.. మళ్లీ మాస్క్ తప్పనిసరి చేస్తున్నాయి.. అందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు ఉపక్రమించాయి.. ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉన్న కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. ఈ క్రమంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. క్రిస్మస్ సందర్భంగా ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉండటంతో.. లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం…
కరోనా సెకండ్ వేవ్ ముగిసి క్రమంగా సాధారణ పరిస్థితులు వచ్చాయి.. మొదటల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్నా.. తర్వాత.. కరోనా పని అయిపోయిందనే తరహా ప్రచారం కూడా సాగింది.. అయితే, ఇప్పుడు జాగ్రత్తగా ఉంటేనే.. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు ఉండదని ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచిస్తూనే ఉంది. కానీ, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.. కరోనా వైరస్ తాజా రూపాంతరం ‘ఒమిక్రాన్’ యావత్ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది.. కొత్త వేరియంట్ వెలుగుచూసిన…
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కోవిడ్ మరణాలు ఒక్క యూరప్‌లోనే పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. గత వారంలోనమోదైన కోవిడ్ మరణాల్లో 5శాతం మేర యూరప్ ఖండంలోనే పెరుగుదల కనిపించినట్టు వెల్లడించింది. అమెరికా, యూరప్, ఆసియా ప్రాంతాల్లో పెరుగుదలతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 6శాతం మేర పెరిగాయని పేర్కొం ది. యూరప్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కోవిడ్ మరణాలు స్థిరంగా ఉండటమో, తగ్గడమో జరిగిందని, గతవారంలో ప్రపంచ వ్యాప్తంగా…
పువ్వులను ఇష్టపడని మహిళలు ఉండరు. ఎన్నో రకాల పువ్వులు నిత్యం మనకు మార్కెట్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు చాలా మంది హోమ్ గార్డెనింగ్ పేరుతో పూల మొక్కలను ఇంట్లోనే పెంచుకుంటున్నారు. అయితే, బ్రహ్మకమలం, రఫ్లీషియా వంటి పువ్వులు అరుదుగా పూస్తుంటాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ పువ్వులు పూస్తుంటాయి. పెనిస్ ప్లాంట్ల్ లేదా కార్ప్స్ ప్లవర్ అనే పుప్వు చాలా అంటే చాలా అరుదుగా మాత్రమూ పూస్తుంది. చరిత్రలో ఇప్పటి వరకు కేవలం మూడుసార్లు మాత్రమే పూసినట్టు చరిత్ర…