సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషమని.. వస్త్ర పరిశ్రమ ఆసాములు, నేతన్నలంతా ఐక్యంగా చేసిన పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు నేతన్నల డిమాండ్లన్నీ పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు.