Off The Record: నెల్లూరు వైసీపీలో లుకలుకల రచ్చ.. డబుల్ గేమ్ నేతలపై హైకమాండ్ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: వైసీపీలో అసమ్మతి గళాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో లుకలుకలు ఓ రేంజ్‌లో రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి… ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా ఆనంను తప్పించి… నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని నియమించింది. ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజవర్గం వంతు వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అసంతృప్తిలో ఉన్నారనే ప్రచారం ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు.
Read Also: RTC Bus: బెజవాడలో హోటల్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
Also Read
అయితే మంత్రి పదవి రాకపోవటమే కాకుండా తన కంటే జూనియర్ అయిన అనిల్‌కుమార్ యాదవ్‌కు క్యాబినెట్‌లో బెర్త్ దక్కటంతో ఆయన మరింత రగిలిపోయారట. ‘మొగుడు కొట్టినందుకు కాదు… తోడి కోడలు నవ్వినందుకు’ అన్నట్లుగా అయ్యింది కోటంరెడ్డి వ్యవహారం. అప్పటినుంచే అవసరం వచ్చినప్పుడు పార్టీ కంటే… సొంత ఇమేజ్ కోసం ఆయన ప్రయత్నించటం మొదలుపెట్టినట్లు చర్చ జరుగుతోంది. సెకెండ్ ఫేస్ క్యాబినెట్‌లో అయినా బుగ్గ కారు ఎక్కవచ్చునని ఆశించినా… సామాజిక సమీకరణాల కారణంగా కోటంరెడ్డికి అవకాశం దక్కలేదు. అమరావతి రైతుల యాత్ర నెల్లూరు వచ్చినప్పుడు ప్రత్యేకించి వారు ఉన్న శిబిరానికి వెళ్లి పరామర్శించి రావటం అప్పట్లో చర్చనీయాంశంగా మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి పార్టీ వర్గాలు. మరోవైపు, కోటంరెడ్డి బెట్టింగ్ కేసుల్లో పూర్తిగా కూరుకుపోయి ఉన్నారని…ఆ విషయంలోనూ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సమస్య ప్రారంభంలోనే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్లు కూడా కోటంరెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేయలేదని సమాచారం. ఈలోపు కోటంరెడ్డి కూడా పార్టీ నిర్ణయానికి విలువ ఇవ్వాల్సి ఉన్నా… పార్టీ లైన్‌ను దాటి టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ అధికారులపై ఓపెన్‌గా కామెంట్లు చేయటంతో… కోటంరెడ్డిని పిలిపించారు ముఖ్యమంత్రి జగన్. జనవరి రెండో తేదీన ముఖ్యమంత్రితో కోటంరెడ్డి దాదాపు గంట సేపు వన్ టు వన్ సమావేశం అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి నుంచి రాజకీయ అంశాల వరకు మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ సమావేశం తర్వాత కోటంరెడ్డి కూడా ముఖ్యమంత్రితో సమావేశంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే అప్పటికే కోటంరెడ్డి ఒక ఎజెండా ఫిక్స్ చేసుకుని ఉన్నారనీ, హైదరాబాద్ వెళ్లి చంద్రబాబుతో కలిశారనీ పార్టీ పెద్దలకు సమాచారం చేరిందట. 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేయనున్నట్లు కోటంరెడ్డి మాట్లాడిన ఆడియో టేపు లీక్ కావటంతో మరింత స్పష్టత వచ్చినట్లు అయ్యింది. దీంతో పార్టీ పెద్దలు కూడా కోటంరెడ్డి ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారట. అందరికీ అవకాశాలు ఒకేసారి ఇవ్వటం సాధ్యం కాదనీ, పార్టీకి లాయల్‌గా ఉండటం అన్నింటికంటే ముఖ్యం అన్న మెసేజ్ పార్టీ ఇతర నేతలకు ఇవ్వాలనుకుంటుందట. ఇతర పార్టీలతో టచ్‌లో ఉండి… ఇక్కడ డబుల్ గేమ్ ఆడాలనుకునే నేతల విషయంలో పార్టీ హైకమాండ్ ఉపేక్షించదని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకే కోటంరెడ్డి వ్యవహారానికి తెరదించేయాలన్న నిర్ణయానికి అధికార వైసీపీ వచ్చేసిందనీ, అధికారిక ప్రకటన రావడమే తరువాయనీ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!